ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తిరువూరులో ఈ నెల 20న ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. తిరువూరులో డయాలసిస్ సెంటర్ కి 37 లక్షలు నిధులు ఇస్తా అన్నానని, కలెక్టర్ కు నిధులు ఇస్తా అని లేఖ రాశా అన్నారు. అంతేకాకుండా.. ఎమ్మెల్యే పడనివలేదని, ఎమ్మెల్యే చేయలేదు నన్ను చేయనివ్వడన్నారు. టీడీపీ సమయంలో మొదలెట్టిన పనులు ఇపుడు ఆపేశారని, ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు, అభివృద్ధి చేయనపుడు ఎమ్మెల్యే ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే 5 కోట్లు అడిగితే నేను ఎంపీ నిధుల నుంచి ఇచ్చే వాడిని కదా ? మా ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి పనులు తిరువూరు లో చేశాం అని కేశినేని నాని అన్నారు.
Also Read : Etela Rajender : వీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడు…
అయితే.. కేశినేని నానికి ఎమ్మెల్యే రక్షణ నిధి కౌంటర్ ఇచ్చారు.. ఆయన తాజాగా మాట్లాడుతూ.. 4 ఏళ్లుగా కేశినేని నాని తిరువూరు రాలేదని, కరోనా సమయంలో ప్రాణాలు పోతున్నా తిరువూరు వైపు ఎంపీ చూడలేదన్నారు. ఎంపీకి నా గురించి మాట్లాడారని, ఎంపీకి ఇక్కడ పరిస్థితి గురించి ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. నిత్యం ప్రజల్లో ఉండి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా తాగు నీటి సమస్య పరిష్కారం కోసం పని చేస్తున్నానని, ఎంపీ నానికి వాళ్ళ కుటుంబంలో, పార్టీలోనే మనశ్శాంతి లేదన్నారు. తిరువూరు లో నాని అంటే ఎవరూ మాట్లాడటం లేదని, అందరూ చిన్ని చిన్ని అంటున్నారన్నారు. మీ ఇద్దరిలో ఎవరో తేల్చుకుని మాట్లాడాలని, ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఏకవచనంతో మాట్లాడి ఎంపీ కించపరుస్తున్నారన్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. టీడీపీ, వైసీపీ నేతల సవాళ్ల నేపథ్యంలో టీడీపీ నేత మునయ్యను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు.
Also Read : Ashwini Choubey : కనిపిస్తే కాల్చేయాలి.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు