MLA Rakshana Nidhi: అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేసేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది.. మార్పులు, చేర్పుల్లో భాగంగా కొందరి సిట్టింగ్‌లను సైతం వైసీపీ పక్కన పెడుతోంది.. కొందరి స్థానాలను మారుస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే ఈ మార్పుల్లో కొందరు సిట్టింగ్‌ల సీట్లు గల్లంతు అవుతున్నాయి. దీంతో.. ఇతర పార్టీల నేతలతో టచ్‌లోకి వెళ్లిపోతున్నారు.. ఈ క్రమంలోనే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. తిరువూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధికి.. వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయట.. ఈ పరిణామాలో 25 రోజులుగా తిరువూరు నియోజకవర్గానికి దూరంగా స్వస్థలం తోట్లవల్లూరులో ఉంటున్నారు.. ఇప్పటికే వైసీపీ మూడు లిస్ట్‌లు విడుదల చేయగా.. నాల్గో లిస్ట్‌పై కసరత్తు చేస్తోంది.. అయితే, ఫోర్త్ లిస్ట్ లో పేరు లేకపోతే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. ఇప్పటికే రక్షణ నిధికి టచ్‌లోకి వెళ్లిందట తెలుగుదేశం పార్టీ.. ఇక, ఆయన పామర్రు టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
Read Also: Telangana Govt: ఆరిజన్ లైఫ్ సైన్స్ తో రూ.2000 కోట్ల డీల్ కుదుర్చుకున్న తెలంగాణ సర్కార్
తిరువూరు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన రక్షణనిధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పేసినట్లు సమాచారం. తిరువూరు నుంచి రెండు సార్లు విజయం సాధించిన తనకు టికెట్ నిరాకరించడంపై ఎమ్మెల్యే రక్షణ నిధి ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. పార్టీలోనే ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేతలను రక్షణనిధి వద్దకు పంపినట్లు తెలిసింది. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ చర్చలు జరిపినప్పటికీ.. రక్షణనిధి మాత్రం పార్టీలో కొనసాగేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. పార్టీలో కొనసాగాలంటే తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందేనని, లేదంటే మరోపార్టీ చూసుకుంటానంటూ తెగేసి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.. మరి ఫోర్త్ లిస్ట్ వచ్చేవరకు ఉంటారా? ఈ లోపే టీడీపీలో చేరతారా? అనే విషయం తెలాల్సి ఉంది.