శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటి రోజు సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీ ఉన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తా అని హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులేకుండా చూస్తా అని, ఆస్పత్రిలో ఉన్న పరికరాలతో పాటు మరిన్ని ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని బాలయ్య బాబు చెప్పారు. Also…
హిందూపురం మున్సిపాలిటీలో కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. ఎట్టకేలకు మున్సిపల్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మొన్నటి వరకు మున్సిపాలిటీల్లో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న వైసీపీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురు దెబ్బలు వరుసగా తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలంతా తెలుగుదేశం పార్టీ, బీజేపీలో చేరగా.. తాజాగా మున్సిపాలిటీలు కూడా టీడీపీ పరమవుతున్నాయి
MLA Balakrishna: హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ లో నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి సవిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఇక, బస్సులోకి ఎక్కిన తర్వాత బాలకృష్ణ ఓ చిన్న పిల్లాడితో కాసేపు ముచ్చటించారు.
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ చీపురుపల్లి, విజయనగరంలో పర్యటనలో మాట్లాడే తీరు చూశానని.. పేపర్లు ఇటుతిప్పి అటుతిప్పి మాట్లాడారని ఎద్దేవా చేశారు. అసలు భౌగోళిక పరిస్థితులపై అసలు అవగాహన ఉందా అని విమర్శించారు. బాలకృష్ణ విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్ కి రండి అని మంత్రి బొత్స సవాల్ విసిరారు. కళ్లులేని కబోదికి ఏం తెలుస్తుంది ఆ విధంగా ఉంది ప్రసంగమని అన్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్…
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. లెజెండ్ సినిమా 400 రోజులు ప్రదర్శించి దేశ చరిత్రలో ఎమ్మిగనూరు నిలిచిపోయిందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా మనమేనని అన్నారు. ఎన్టీఆర్ నటనకు విశ్వరూపం అని చెప్పారు. మరోవైపు.. మహిళల్లో చంద్రబాబు ఆర్థిక విప్లవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చిన అభినవ భగీరథుడు అని కొనియాడారు.
నా చెల్లి నారా భువనేశ్వరి కూడా ఈ దీక్షలో కూర్చుంటారు అంటూ నందమూరి బాలకృష్ణ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహీ యాత్రకు టీడీపీ తరపున మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. మా పార్టీ తరఫున ఐదు మందిని, జనసేన తరుఫున 5మందీతో కమిటీ వేస్తామని చెప్పారు.
Hindupuram: హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నడుం బిగించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులలో ఆయన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను హిందూపురం వాడినే అని… మనలో మనకి అమరికలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. చలివెందులలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సేవలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని…
ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్ అని, ఆమె మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటని ఆయన అన్నారు. లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ…