AP Assembly: మీసం తిప్పిన బాలయ్య.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో మీసాలు మెలేయడం, తొడగొట్టడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డ స్పీకర్ తమ్మినేని సీతారాం.. వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.. మరోవైపు.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. టీడీపీ సభ్యుల తీరు అభ్యంతరకరమన్న స్పీకర్.. సభ ఔనత్యాన్ని తగ్గించేలా తొడలు కొట్టడం.. మీసాలు మిలేయడం లాంటి చర్యలు సభలో చేయడం తప్పు.. కానీ, సభా స్థానంలో తొడగొట్ట, మీసాలు మిలేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి.. సభ ఆయనకు మొదటి హెచ్చరిక చేస్తోంది. ఇలాంటి చర్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకోవాల్సింది సభ హెచ్చరిస్తోందని పేర్కొన్నారు.
మీసాలు మెలేయడం వంటి వికృత చేష్టలు చేయడం తప్పు.. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచేలా టీడీపీ సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని ప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పయ్యావు కేశవ్‌ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయగా.. మిగతా టీడీపీ సభ్యులను అందరినీ ఒక రోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, లాబీల్లో కూడా నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు.. సభ లోపల ఫోన్లలో వీడియో తీశారు టీడీపీ సభ్యులు పయ్యావుల, ఉండి ఎమ్మెల్యే రామరాజు… స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు.. సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.. సస్పెన్షన్ సందర్భంగా వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది.. బెందాళం అశోక్- బియ్యపు మధుసూదన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. .
Also Read
- అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!