Stalin : భారతదేశం, శ్రీలంక మధ్య సంబంధాలలో చాలా సాన్నిహిత్యం ఉంది. కానీ మత్స్యకారుల అరెస్టు, విడుదలకు సంబంధించిన వివాదం దశాబ్దాల నాటిది. ఫిబ్రవరి 23న కూడా శ్రీలంక 32 మంది భారత జాలర్లను అరెస్టు చేసింది. తమిళనాడు రాజకీయాల్లో చాలా ముఖ్యమైన ఈ అంశాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేవనెత్తారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో సమావేశమయ్యారు. మత్స్యకారుల అరెస్టు అంశంపై మరోసారి లేఖ రాశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి.. అరెస్టు చేసిన మత్స్యకారులను, వారి ఫిషింగ్ బోట్లను శ్రీలంక అధికారుల బారి నుండి విడుదల చేయడానికి జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని స్టాలిన్ ఆ లేఖలో డిమాండ్ చేశారు.
Read Also:Nagendra Babu: మహేష్ బాబు గుణం అలాంటిది: నాగేంద్రబాబు
ఇలాంటి అరెస్టులను ఆపాలని శ్రీలంక ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి వస్తున్నప్పటికీ.. ఈ ధోరణి ఆగడం లేదని ఎంకే స్టాలిన్ అన్నారు. దీనికి సంబంధించి స్టాలిన్ కొన్ని షాకింగ్ గణాంకాలను కూడా విడుదల చేశారు. దీని ప్రకారం, ఈ సంవత్సరం ఎనిమిది వేర్వేరు సంఘటనలలో మొత్తం 119 మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. అలాగే, ఈ మత్స్యకారుల 16 పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుల కారణంగా మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమవుతున్నందున, ఈ విషయాన్ని పరిశీలించి ఖచ్చితమైన పరిష్కారం కనుగొనడానికి వెంటనే ఒక సంయుక్త వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని స్టాలిన్ విదేశాంగ మంత్రిని అభ్యర్థించారు.
ఈ లేఖకు ముందు జనవరి 9, 2025న కూడా స్టాలిన్ కేంద్ర విదేశాంగ మంత్రికి ఒక లేఖ రాశారు. శ్రీలంక చెర నుండి మత్స్యకారులను, వారి ఫిషింగ్ బోట్లను విడుదల చేయడానికి సరైన మార్గాల ద్వారా దౌత్యపరమైన ప్రయత్నాలను ప్రారంభించాలని ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్‌ను అభ్యర్థించారు. జనవరి 8న శ్రీలంక నావికాదళం 10 మంది భారత జాలర్లను అరెస్టు చేసింది. ఆ ఆరుగురు మత్స్యకారులు తమిళనాడుకు చెందినవారు. చాలా మంది మత్స్యకారులు తమ జీవనోపాధి కోసం పూర్తిగా చేపల వేటపై ఆధారపడి ఉన్నారు. జనవరిలో తమిళనాడు ప్రభుత్వం అందించిన డేటా ప్రకారం, 210 ఫిషింగ్ బోట్లు శ్రీలంక ఆధీనంలో ఉన్నాయి.