Get Out Ravi: తమిళనాడులో పొలిటికల్ వివాదం రాజుకుంది. గవర్నర్ ఆర్ ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య విభేదాలు తలెత్తాయి. అధికార డీఎంకే, గవర్నర్ మధ్య వివాదం ముదిరింది. రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రసంగం వివాదానికి కేంద్ర బిందువు అయింది. ‘‘ గెట్ అవుట్ రవి’’ అనే యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. తమిళనాడు ప్రజలు, డీఎంకే పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గవర్నర్ రవికి వ్యతిరేకంగా కామెంట్స్…
తమిళనాడు గవర్నర్, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ముదిరింది. అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి వాకౌట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ జోడించిన లేదా దాటవేయబడిన భాగాలను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఈరోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
Rahul Gandhi's Speeches During Yatra Creating Tremors In India says MK stalin: భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఆయన చేస్తున్న ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని అన్నారు. లౌకికవాదం, సమానత్వం వంటి విలువలను కాపాడేందుకు దేశానికి నెహ్రూ, గాంధీల వంటి నాయకులు అసవరం అని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేత ఏ గోపన్న రాసిన ‘మమనితార్ నెహ్రూ’ పుస్తకాన్ని చెన్నైలో…
MK Stalin's Son, Udhayanidhi, Joins His Cabinet As Sports Minister: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ కేబినెట్ లో చేరారు. మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని చేపాక్ - తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంకే స్టాలిన్ రాజకీయ వారసుడిగా ఉదయనిధిని డీఎంకే పార్టీ భావిస్తోంది. ఉదయనిధి స్టాలన్ ఎప్పటి నుంచో…
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పెద్ద కుమారుడు ఉదయనిధి వచ్చేవారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర కనబర్చిన యువ నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ గుర్తింపు పొందారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీ శ్రీహరన్ సహా ఆరుగురు దోషులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం స్వాగతించారు.
తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాలతో సహా ఎనిమిది జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. డెల్టా జిల్లాలైన తంజావూరు, తిరువారూర్ నాగపట్నంలలో కళాశాలలు కూడా మూసివేయబడ్డాయి.
డీఎంకే నేత సైదాయ్ సాదిక్ రాజకీయ నేతలుగా మారిన నటీమణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరుస్తూ సాదిక్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించాలని సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ డిమాండ్ చేశారు.
కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
MK Stalin Elected As DMK Chief For 2nd Time: ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారు. ఇప్పటికే ఓసారి పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహిాంచిన స్టాలిన్.. వరసగా రెండో సారి కూడా పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన్న పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా దురైమురుగనన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీకి…