జైభీమ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది.కమర్షియల్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టు కుంటుంది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు దక్కిం చుకున్న మొదటి తమిళ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రం పై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించి ప్రశసించాడు. ఏది ఏమైనా ఈ చిత్రం టాప్250 చిత్రాల సరసన చోటు దక్కించుకోవడం మాములు విష యం కాదని వేరే చెప్పనక్కర లేదు. కేవలం మౌత్ పబ్లిసీటీతోనే…
తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు ప్రాంతాల్లో వర్షం తాకిడి అధికంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నవంబర్ 10 వరకు ఇలాగే వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఫ్లడ్ అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా వరద నీటితో మునిగిన ప్రాంతాల్లో సీఎం ఎంకే…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎం.కే స్టాలిన్ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ముందుకు వెళుతున్నారు. ఆ మధ్య అర్థరాత్రి ఓ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీఎం స్టాలిన్, ఇటీవల ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ అవాక్ చేశారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న రోడ్డుపై తన కాన్వాయ్ వెళ్తుండగా వెనుకనుంచి వస్తున్న అంబులెన్స్‌కు సైడ్ ఇచ్చి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇలా ఊహించని రీతిలో తనదైన శైలితో సీఎం స్టాలిన్ ముందుకు…
తమిళ స్టార్ హీరో సూర్యది పెద్ద మనసు. ఆయన తెర మీద మాత్రమే కాదు తెర వెనుక కూడా కథానాయకుడే! నటుడిగా కోట్లాది మంది మనసుల్ని దోచుకునే సూర్య, అర్థవంతమైన చిత్రాలను నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా సూర్య ‘జై భీమ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. అంతే కాదు…. అందులో గిరిజనుల పక్షాన నిలిచి పోరాడే చంద్రు అనే లాయర్ పాత్రనూ పోషించాడు. ఈ నెల 2వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా…
తమిళనాడు సీఎం స్టాలిన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసిన చిరు కాసేపు స్టాలిన్ తో ముచ్చటించారు. ఆ సమయంలోనే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా వున్నారు. ప్రస్తుతం ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది. నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్టాలిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఆ విషయాన్ని మీరు మాటల్లోనే కాకుండా చేతల్లోనూ…
కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు దేశం మొత్తం వణికిపోయింది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి మళ్ళీ లాక్ డౌన్ శరణ్యం అయ్యింది. కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి కావడమే కాకుండా… నష్టం కూడా భారీగానే వాటిల్లింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు కోలీవుడ్ స్టార్స్ అంతా ఏకమయ్యారు. తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను 10 లక్షల రూపాయల చెక్కును…
టౌక్టే తుఫాన్ నుంచి ఇంకా బయటపడక ముందే ఇప్పుడు మరో తుఫాన్ భయపెడుతున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం బలమైన యాస్ తుఫాన్ గా మారి ఈనెల 26వ తేదీన ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. తీవ్రమైన తుఫాన్ గా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంతంలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా తూర్పు తీరప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో…
తమిళనాడులో సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు.. మొత్తం 34మంత్రులతో స్టాలిన్ కేబినెట్ ఏర్పడింది.. ఇందులో ఐదుగురు తెలుగు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వరించాయి.. తమిళ కేబినెట్ లో ప్రతిసారి తెలుగు మంత్రులు స్థానం పొందుతూనే ఉన్నారు.. సీఎం జయలలిత అయినా కరుణానిధి అయినా పన్నీర్ సెల్వం , పాలనిస్వామి ఇలా ఎవరు సీఎం ఉన్నా తెలుగువారికి అవకాశం ఇస్తూనే ఉన్నారు..తమిళనాడులో చెన్నై తో పాటు కోయంబత్తూరు, మదురైలో ఇప్పటికీ లక్షల్లో తెలుగువారు స్థిరపడ్డారు.. కొన్ని నియోజకవర్గాల్లో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకె స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తరువాత మూడు ఫైల్స్ పై స్టాలిన్ సంతకం చేశారు. అందులో మొదటిది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, రేషన్ కార్డులు ఉన్న 2.07 కోట్ల కుటుంబాల కు రూ.4వేల రూపాయల చొప్పున సాయం అందించే ఫైల్ పై ముఖ్యమంత్రి స్టాలిన్ సంతకం చేశారు. ఇందులో మొదటి నెలలో రూ. 2 వేలరూపాయలు, తరువాత నెలలో రెండు వేల రూపాయలను జమ చేయనున్నారు. ఇక…