Mamata Banerjee: కర్ణాటకలో బీజేపీ దారుణంగా ఓడిపోవడంపై ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే.. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం, డీఎంకే స్టాలిన్ కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలకు అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tamil Nadu: తమిళనాడులో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నేపథ్యం, కార్పెంటర్ కూతురు ప్లస్ టూలో మెరుగైన ప్రతిభ కనబరిచింది. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసలు అందుకుంది. హయ్యర్ సెకండరీ పరీక్షల్లో 12వ తరగతి దిండిగల్ విద్యార్థిని ఎస్ నందిని ఏకంగా 600కు 600 మార్కులు సాధించింది. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ (డీజీఈ) సోమవారం వెల్లడించిన ఫలితాల్లో నందిని 600/600 స్కోర్ సాధించింది.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ త్వరలో కేబినేట్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారని అధికారికి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఈ నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నందున మరో రెండు వారాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం ఫ్యాక్టరీల (సవరణ) చట్టం 2023ని ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సోమవారం తెలిపారు. సంస్కరణలను తీసుకురావడానికి మాత్రమే కాకుండా, ఒక సమస్యపై ఏకాభిప్రాయ అభిప్రాయాన్ని అంగీకరించడానికి కూడా ధైర్యం అవసరమని నొక్కిచెప్పిన ఆయన.. అనేక కార్మిక సంఘాలు వ్యక్తం చేసిన భయాందోళనలను అనుసరించి వివాదాస్పద చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు.
CAPF constable exam: కేంద్ర సాయుధ పోలీస్ ఫోర్స్(CAPF) కానిస్టేబుల్ పరీక్షను హిందీ, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర సాయుధ బలగాల్లో యువత ప్రాధాన్యతను పెంచడాని, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. CAPFలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్…
Bharat Express Train: ప్రధాని నరేంద్రమోదీ శనివారం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో వందేభారత్ ట్రైన్ తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో 12వ వందేభారత్ రైలును ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం అనంతరం తమిళనాడు పర్యటకు వెళ్లారు.
శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన 16 మంది జాలర్లు, 102 మత్స్యకార బోట్లను త్వరగా విడుదల చేసేందుకు అవసరమైన దౌత్యపరమైన చర్యలను ప్రారంభించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
MK Stalin: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలోకి రాకుండా చూడటం, ప్రధాని మోదీ మళ్లీ ప్రధాని కాకుండా చూడటం తమ లక్ష్యమని, విపక్షాలు అందుకోసమే ప్రయత్నిస్తున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. స్టాలిన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూఖ్ అబ్దుల్లా కోరడంపై మాట్లాడుతూ.. తాను ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనే నిమగ్నమై ఉన్నానని స్టాలిన్ అన్నారు.
Farooq Abdullah comments on Mallikarjun Kharge: ముందుగా ఎన్నికల్లో గెలుద్ధాం, ఆ తరువాత ప్రధాని ఎవరు అవుతారో చూద్దాం అని కాశ్మీర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్డుల్లా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఫరూక్ అబ్దుల్లా, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్వాదీ పార్టీ…
పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలను మార్చి 1న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార డీఎంకే సన్నాహాలు చేస్తోంది. నవజాత శిశువులకు బంగారు ఉంగరాల బహుమతి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అన్నదానం వంటి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.