Tamil Nadu Cabinet approves ordinance to ban online gambling in state: ఆన్‌లైన్ గేమింగ్ పిల్లలు, యువతపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్ గేమింగ్ నిషేధించాలని భావిస్తున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం ఆన్‌లైన్ గేమింగ్ ను నిషేధిస్తూ.. రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆర్ధినెన్స్ కు ఆమోదం తెలిపింది. తమిళనాడు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత రాష్ట్రంలో ఆర్డినెన్స్ అమలులోకి రానుంది.
తమిళనాడు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రిటైర్ జడ్జి జస్టిస్ ఆరుముగసామి ఇచ్చిన నివేదికపై చర్చించిన కేబినెట్.. జయలలిత నెచ్చెలి సహా మరికొందరిని విచారించేందుకు న్యాయనిపుణులతో చర్చించాలని నిర్ణయించింది.
Tamil nadu school girl dead: తమిళనాడు రాష్ట్రంలో వరసగా స్కూల్ విద్యార్థినుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ ఆత్మహత్యలను సీరియస్ గా తీసుకుంది. తాజాగా మరో స్కూల్ విద్యార్థిని ఇంట్లో శవమై కనిపించింది. శివకాశిలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోయింది. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేలికపాటి జ్వరంతో అస్వస్థత చెందారని ఆ రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్ తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని మంత్రి దురైమురుగన్ వెల్లడించారు. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో ఈ రోజు పర్యటించాల్సి ఉంది. స్టాలిన్ పర్యటనకు అధికారులు,…
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (దక్షిణ భారత శాఖ) ఆధ్వర్యంలో చెన్నైలో నేడు, రేపు జరుగబోతున్న సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘ప్రాంతీయం కొత్త జాతీయం’ రిపోర్ట్ ను ఆవిష్కరించారు. ‘కళ అంటే కేవలం వినోదమే కాదు, గుట్కా, గంజాయి దురాచారాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రగతిశీల ఆలోచనల ఆధారంగా సామాజిక దురాచారాలను ఎత్తి చూపడమే కళ’…
చెన్నైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల రోజుగా విడవకుండా కురుస్తున్న జోరు వర్షంతో చెన్నై మహానగరం వణుకుతోంది. గంటల తరబడి కురుస్తున్న వానలు తమిళుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నైలోని మూడు సబ్ వేల నుంచి రాకపోకల్ని అధికారులు నిలిపి వేశారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు మోకాలు లోతు వాన నీరు రోడ్డు మీద నిలిచిపోయింది. దీంతో.. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో…
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. తమిళనాడులోని కూనూరు సమీపంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు చెప్పారు. తాను కూడా ఘటనా స్థలికి వెళ్తున్నట్టు ట్విటర్‌లో తెలిపారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే తమిళనాడు మంత్రులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన మార్క్ చూపిస్తున్నారు స్టాలిన్.. కొన్ని సందర్భాల్లో అందరినీ ఆయన నిర్ణయాలు ఆశ్చర్యంలో ముంచేసిన సందర్భాలు లేకపోలేదు.. ఇక, ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు స్టాలిన్… రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారికి సహాయం అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. ఇవాళ దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.. కరోనాబారినపడి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 50 వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.. కాగా, ఇప్పటి వరకు తమిళనాడులో కరోనాతో…
తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 15 రోజుల నుంచి తమిళనాడులో తగ్గేదేలే అన్నట్లుగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో చెన్నై సహా 23 జిల్లాలోని స్కూల్స్ కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిన్న రాత్రి నుంచి చెన్నైలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. Also Read : అండమాన్లో అలజడి.. మరోసారి ఏపీకి భారీ వర్షసూచన.. అంతేకాకుండా మెరీనా…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలితో మందుకు వెళుతున్నారు ఎంకే స్టాలిన్. మొన్నటి వరకు ఆయన చేసిన పనులకు నీరాజనం పట్టిన ప్రజలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడుపై ప్రభావం చూపింది. భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలమైంది. అయితే ఈ నేపథ్యంలో వరదలు సంభవించాయి. దీంతో వరదలను ఎదుర్కొవడంలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందంటూ ట్విట్టర్ వేదికగా గోబ్యాక్స్టాలిన్ హ్యాష్ట్యాగ్తో విమర్శలు…