రాబోయే రోజుల్లో నీటికొరతను నివారించేందుకు, భవిష్యత్ తరాల కోసం నదుల్ని పరిరక్షించాల్సిన అవసరం వుందన్నారు మంత్రి హరీష్ రావు. నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ పైనే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మిషన్ కాకతీయతో పడ్డ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి ఆయకట్టు పెంచుకున్నాం.
రాష్ట్రంలో 46 వేల చెరువులను పునరుద్ధరించుకున్నాం.కుంభవర్షాలు పడ్డా ఎక్కడా చెరువులు తెగలేదు. భూగర్భజలాలు పెరిగాయి.4వేల చెక్ డ్యామ్ లను 6వేల కోట్లతో నిర్మించుకున్నాం. తద్వారా భూగర్భజలాలు పెరిగి సంవత్సరం అంతా చెరువులను వినియోగంలోకి తీసుకొచ్చాం.పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదని సీఎం కేసీఆర్ నిరూపించారు.141 టీఎంసీల రిజర్వాయర్లను గోదావరి నదిపై నిర్మించుకున్నాం.
భవిష్యత్ తరాల కోసం నదులను కాపాడుకోవాలి.2014 తలసరి ఆదాయం 1,24,104 ఉంటే. 2021 తలసరి ఆదాయం 2,78,933కు పెరిగింది. రెండింతలు పెరిగింది.2014లో జిడిపి 5,500 రూపాయలు, 2021లో జిడిపి 11,54,000 రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఉత్తర్ ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. కాళేశ్వరం క్లియరెన్స్ కోసం 3 నెలల సమయం పట్టింది. మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ సాగునీటి ప్రాజెక్టు అన్నారు. మూసీ పునరుద్ధరణ పనులు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. కొద్దిరోజుల్లోనే వాటి పనులు మొదలుపెట్టారన్నారు మంత్రి హరీష్ రావు.