గుంతలో పడ్డ వ్యక్తిని క్షేమంగా బయటకు తీసిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ అగ్రహారం వద్ద జరిగింది. మిషన్ భగీరథ గేట్ వాల్ గుంతలో ఓ వ్యక్తి పడిపోగా.. అక్కడున్న స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు.
Smita sabharwal: తెలంగాణ సీఎంఓ సెక్రటరీ, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తరచూ ట్విట్టర్‌లో ఏదో ఒక అంశంపై పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల వీడియోను ఆమె రీట్వీట్ చేశారు.
ప్రస్తుతం మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృధాగా పోతున్న పట్టించుకునే వారు కరువయ్యారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రం సమీపంలోని శ్రీనివాస రైస్ మిల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన చోటుచేసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటింటికీ మంచినీరు అందించే పథకం రోడ్లపై ఆవిరైపోతోంది. వరంగల్ జిల్లా ఖానా పురం మండలం వేపచెట్టు తండా సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ పగిలి నీరు చిమ్మడంతో ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారి జలమయమైంది.
మిషన్ భగీరథకు జాతీయ అవార్డుపై కేంద్ర జల శక్తి శాఖ స్పందించింది. మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దమని కేంద్రం వెల్లడించింది. ఆ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని జలశక్తి శాఖ వెల్లడించింది.
మిషన్ భగీరథకు అవార్డుతో అయినా కేంద్ర మంత్రులకు కనువిప్పు కలగాలని మంత్రి హరీష్ రావ్ మండిపడ్డారు. రెండు రోజులకు ఒక కేంద్ర మంత్రి వస్తున్నారు తెలంగాణ సర్కార్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దవచేశారు.