Errabelli Dayakar Rao: కేంద్రం వాటిని కట్టొద్దని చెప్పి, నిధులు ఆపేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao On Nalgonda Development: రైతు కళ్ళాలు, రైతు వేదికలు కట్టొద్దని కేంద్రం చెప్తోందని.. రావాల్సిన నిధుల్ని సైతం ఆపేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 703 కోట్లు రావాల్సి ఉండగా.. రైతు కళ్లాల కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేశామన్న కారణంతో ఆ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కింద అత్యంత నాణ్యమైన పనులు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చామని, మిషన్ భగీరథ కోసం కూడా ఆ జిల్లాకు దాదాపు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల వచ్చిన పల్లె ప్రగతి ట్రాక్టర్ల కారణంగా.. గ్రామ పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. అయితే.. కొంతమంది కావాలనే కిస్తీలకు డబ్బులు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలన్నది సీఎం కేసిఆర్ ఆదేశమని, ఆయన ఆదేశాల మేరకు అన్ని రోడ్లు వేస్తామని దయాకర్ రావు హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామ పంచాయతీలు, ఇతర రాష్ట్రాలలోని పట్టణాలతో పోటీ పడుతున్నాయని అన్నారు. గ్రామాలకు వలసలు తిరిగి వస్తున్నాయని.. నిజాయితీగా పని చేసిన సర్పంచులు, ఆ గ్రామ పంచాయతీకి ఎక్కువ నిధులను పొందుతున్నారని అన్నారు. అయితే.. కొంతమంది డ్రామాలు ఆడుతూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అటు.. కేంద్రం కూడా రాష్ట్రానికి రావలసిన డబ్బులను ఆపేసి, ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పథకం కింద మంచి పనులు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్రం.. ఆ పథకాన్ని ఆపే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గతంలో కేంద్రం నుంచి ఒక టీమ్‌లో ముగ్గురు అధికారులు వచ్చి చూసేవారని, కానీ ఈసారి 18 టీమ్స్ వచ్చి చూడడం విశేషమని తెలిపారు.
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ 'డెడ్ డ్రాప్' డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!