Tata Ace Dragged A Person In Karimnagar For 50 Meters: కొత్త సంవత్సరం సందర్భంగా ఢిల్లీలో ఓ యువతిని కారు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన సంఘటన తరహాలోనే కరీంనగర్ జిల్లాలో తాజాగా ఓ ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడ్ని ఢీకొట్టిన టాటా ఏస్.. యాభై మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో కొద్దిదూరం ఈడ్చుకెళ్లిన తర్వాత యువకుడు మృతి చెందాడు. కరీంనగర్-వరంగల్ ప్రదాన రహదారిపై చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మనుకొండూర్ మండలం కొండపల్క గ్రామానికి చెందిన శ్రీకాంత్ బైక్‌పై వెళ్తున్నాడు. అప్పటివరకూ అతని ప్రయాణం సాఫీగానే సాగింది.
Turkey Earthquake: ఓ వైపు విషాదం, మరోవైపు దొంగతనాలు.. 48 మందిని అరెస్ట్ చేసిన టర్కీ..
అయితే.. ఇంతలో అత్యంత వేగంతో వచ్చిన ఓ టాటా ఏస్, శ్రీకాంత్ బైక్‌ని ఢీకొట్టింది. టాటా ఏస్ డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేక బైక్‌ని గుద్దేశాడు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ తన వాహనం ఆపకుండా కొద్దిదూరం నడుపుకుంటూ పోయాడు. దాదాపు 50 మీటర్ల వరకు టాటా ఏస్ వాహనం మృతుడ్ని ఈడ్చుకెళ్లింది. దీంతో.. తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే శ్రీకాంత్ మృతి చెందాడు. ఒకవేళ ప్రమాదం జరిగిన వెంటనే టాటా ఏస్‌ని ఆపి ఉంటే, మృతుడు ప్రాణాలతో బయటపడేవాడేమో! కానీ.. ఆపకుండా ఈడ్చుకెళ్లడంతో శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఈడ్చుకెళ్లే క్రమంలో శ్రీకాంత్ శరీరానికి తీవ్ర దెబ్బలు తగిలినట్టు సమాచారం. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్, మిషన్ భగీరథలో పంపు ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించేవాడు.
Canada: చైనా పనేనా..? కెనడా గగనతలంలో అనుమానాస్పద వస్తువు.. కూల్చేసిన అమెరికా
కాగా.. ఢిల్లీలో అంజలి సింగ్‌ని కారు ఈడ్చుకెళ్లిన సంఘటన తర్వాత ఇలాంటివే చాలా వెలుగు చూశాయి. ఈ ఘటనలోనూ అంజలిని 12 కిలోమీటర్లు లాక్కెళ్లడంతో, ఆమె శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరో ఘటనలో.. ఓ వృద్ధుడిని ఒక కారు కొన్ని కిలోమీటర్లు మేర ఈడ్చుకెళ్లడంతో, ఆయన మృతి చెందాడు. ఆ వృద్ధుడు సైకిల్‌పై ప్రయాణం చేస్తూ రోడ్డు దాటుతుండగా.. ఓ కారు ఆయన్ను ఢీకొట్టింది. దీంతో ఆ వృద్ధుడు కారు బ్యానెట్‌పై పడ్డాడు. అయినా కారు ఆపకుండా కొంత దూరం తీసుకెళ్లిన కారు.. ఒక చోట సడెన్ బ్రేక్ వేసింది. దీంతో వృద్ధుడు కింద పడిపోగా.. అతనిపై కూడా కారు దూసుకెళ్లింది. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.