భర్తలు భార్యలను హింసలు పెట్టేవారు.. కొట్టేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది గురు అంటున్నారు నేటి మహిళలు.. భర్తలు కొడితే తిరిగి కొడుతున్నారు భార్యలు.. చిన్న కారణానికి కూడా భార్యలు భర్తలను టార్చర్ చేస్తున్నారని చాలా మంది భార్యా భాధితులు చెబుతున్నారు.. తమ భర్తల్ని భార్యలు టార్చర్ పెడుతుంటారు. తమ చెప్పుచేతుల్లో ఆడించాలని ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ తమ మాట వినకపోతే.. చెయ్యి కూడా చేసుకుంటారు. చేతికి దొరికిన వస్తువులతో కొడుతుంటారు. లాక్‌డౌన్ సమయంలో వేలాదిమంది భార్య బాధితులు…
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో 17 ఏళ్ల బాలిక, 20 ఏళ్ల ముస్లిం మహిళా టీచర్‌తో కలిసి అదృశ్యమయ్యారు. ఈ ఘటన బికనీర్ లో జరిగింది. అయితే కావాలనే తమ అమ్మాయిని కిడ్నాప్ చేశారని మైనర్ బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక చదివే ప్రైవేట్ కాలేజీలో ఉపాధ్యాయురాలు నిదా బహ్లీమ్ పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నరు. ఇందు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సీసీ కెమెరాలో నమోదైంది.
Twist in Missing Case: చిత్తూరు జిల్లా తెలుగు గంగ కాలువలో యువతి మృతదేహం లభ్యం ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయిందని భావించిన యువతి వీడియోలో ప్రత్యక్షమైంది. హత్య చేశాడని అనుమానించిన యువకుడితోనే వీడియోలో యువతి కనిపించింది. శ్రీకాళహస్తిలోని రామాపురం గ్రామానికి చెందిన చంద్రిత అనే యువతి ఈ ఏడాది జనవరి నుంచి మిస్సింగ్ అయ్యింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ చంద్రశేఖర్‌తో యువతి చంద్రిత…
Missing Case: కడప జిల్లా బద్వేల్ పట్టణంలో 7వ తరగతి విద్యార్థిని అదృశ్యం అయ్యింది. మూడు రోజులు గడచినా విద్యార్థిని ఆచూకీ తెలికపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బద్వేల్ మండలం ఉప్పత్తివారిపల్లె గ్రామానికి చెందిన గాజులపల్లె చిన్న వెంకట సుబ్బారెడ్డి రవణమ్మ కుమార్తె వెంకట సంజన బద్వేల్ పట్టణంలోని గోపిరెడ్డి స్కూలులో 7వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం స్కూలు నుంచి బయటకు వచ్చిన వెంకట సంజన తిరిగి స్కూల్‌కు వెళ్ళక పోవడంతో…
పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైంది కల్యాణ్ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే రామాంజనేయులుగా గుర్తించారు. భర్త అపహరణపై నిన్న పోలీసులకు రామాంజనేయులు భార్య ఫిర్యాదు చేశారు. జంగం బాజితో పాటు అన్నవరపు కిషోర్ మరికొందరు షాపులోకి వచ్చి అపహరించారని ఫిర్యాదు చేశారు. రామాంజనేయులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో చంటి అనే వ్యక్తి అదృశ్యం వెనుక రామాంజనేయులు ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే…
హైదరాబాద్‌లో ఓ యువతి అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. దోమలగూడ లో నివాసముంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది. నిన్న బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన భార్గవి తిరిగి రాలేదు. దీంతో నిన్నటి నుంచి కుటుంబీకులు భార్గవి కోసం తెలిసిన వాళ్ల దగ్గర, బంధువుల ఇండ్లలో వెతికినా ఫలితం లేకుండాపోయింది. అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న భార్గవికి సంవత్సరం క్రితమే వివాహమైంది. భార్గవి ఆచూకీ తెలియకపోవడంతో…