హైదరాబాద్‌లో ఓ యువతి అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. దోమలగూడ లో నివాసముంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది. నిన్న బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన భార్గవి తిరిగి రాలేదు. దీంతో నిన్నటి నుంచి కుటుంబీకులు భార్గవి కోసం తెలిసిన వాళ్ల దగ్గర, బంధువుల ఇండ్లలో వెతికినా ఫలితం లేకుండాపోయింది.
అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న భార్గవికి సంవత్సరం క్రితమే వివాహమైంది. భార్గవి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబీకులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భార్గవి నడుచుకుంటూ తిరుగుతున్నట్లుగా సీసీ కెమెరాల ఫుటేజీలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.