Rajasthan: 17 బాలిక, 20 ఏళ్ల మహిళా టీచర్ మిస్సింగ్.. “లవ్ జిహాద్” అని ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో 17 ఏళ్ల బాలిక, 20 ఏళ్ల ముస్లిం మహిళా టీచర్‌తో కలిసి అదృశ్యమయ్యారు. ఈ ఘటన బికనీర్ లో జరిగింది. అయితే కావాలనే తమ అమ్మాయిని కిడ్నాప్ చేశారని మైనర్ బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక చదివే ప్రైవేట్ కాలేజీలో ఉపాధ్యాయురాలు నిదా బహ్లీమ్ పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
Read Also: Marriage: అక్కడ పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ఇష్ట పడుతున్నారు.. ఎందుకు?
Also Read
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
- Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ఇదిలా ఉంటే ఆ అదృశ్యం వెనక ‘లవ్ జిహాద్’ కోణం ఉందని బీజేపీ, పలు హిందూ సంఘాలు ఆరోపిస్తు్న్నాయి. మా అమ్మాయిని హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మార్చేందుకు కిడ్నాప్ చేసినట్లు మైనర్ బంధువులు ఆరోపిస్తున్నారు. 12వ తరగతి చదువులునన బాలిక జూన్ 30న అదృశ్యమైన తర్వాత బంధువులు స్నేహితుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఈ మిస్సింగ్ వ్యవహారంలో ఉపాధ్యాయురాలని అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గత రెండు నెలలుగా సదరు మహిళా టీచర్ బాలికతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తుందని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. జూన్ 30న ఇంటి నుంచి వెళ్లిన బాలిక స్కూల్ కి వెళ్లలేదని తేలింది. అయితే రెండు రోజుల తర్వాత వీరిద్దరిని జైపూర్ రైల్వే స్టేషన్ లో గుర్తించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణలో మైనర్ బాలిక, ఆమె టీచర్ కొంత కాలంగా రిలేషన్ లో ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. విద్యార్థిని, ఆమె టీచర్ ను పట్టుకునేందుకు పోలీస్ టీములు రంగంలోకి దిగాయి. బికనీర్‌లోని శ్రీ దున్‌గర్‌ఘర్ పట్టణంలోని వ్యాపారులు మంగళవారం మార్కెట్‌ల బంద్ చేసి ఈ ఘటనకు నిరసన తెలిపారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!