Supreme Court: నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై విధించిన నిషేధాన్ని ఐదేళ్ల పాటు పొడిగించే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాకలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3(1) కింద సిమిని "చట్టవిరుద్ధ సంఘం"గా ప్రకటిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ సిమి కి చెందిన మాజీ సభ్యుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
హైదరాబాదులో నేరాలు చేస్తున్న నైజేరియన్స్‌ను డిపోర్ట్ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్ పోర్ట్ లతో ఇండియాలోకి ప్రవేశిస్తున్నారని, అలాంటి వాళ్లను కూడా అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను ప్రారంభించిన ఆయన కార్యక్రమంలో ప్రసంగించారు. నైజీరియన్లను వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేస్తారని భయంతో ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని సంచలన విషయాన్ని తెలిపారు.
Tapan Deka: కేంద్ర ప్రభుత్వం నేడు (మే 20)న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ పొడిగింపు 2025 జూన్ 30 తర్వాత ప్రారంభమై 2026 జూన్ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటుంది. తపన్ కుమార్ డేకా 1988 బ్యాచ్‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2022 జూలై 1న ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా బాధ్యతలు…
Indian Govt: పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖలు రాసింది కేంద్ర హోంశాఖ. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 వినియోగించుకోవాలని ఆ లేఖలో తెలిపింది.
Bandi Sanjay : పాకిస్తానీ చేతిలో దుబాయిలో దారుణంగా హత్యకు గురైన ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రేమ్ సాగర్ తోపాటు హత్యకు గురైన నిజామాబాద్ కు చెందిన శ్రీనివాస్ మృత దేహాలను వీలైనంత తొందరగా స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు మృతుల కుటుంబాలకు అండగా…
Central Team: నేటి నుంచి వరద నష్టంపై తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించబోతుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్& కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం.. హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో సమావేశం కానుంది.
ఈ రోజు హోం శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశానికి హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావు, హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా.. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య క్రైం రేటు 46. 8 శాతం పెరిగిందని సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు.. మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై క్రైం 152 శాతం, మిస్సింగ్ కేసెస్ 84 శాతం, సైబర్ క్రైం నేరాలు 134…
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. CRPFలో 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.