JKGF Banned In India: భారత దేశానికి, భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడుతున్న ఉగ్రసంస్థలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకర్తలతో ఏర్పాటైన జమ్మూ కాశ్మీర్ గజ్నవీ ఫోర్స్ (జేకేజీఎఫ్)పై శుక్రవారం ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేంద్రం నిషేధం విధించింది. దీంతో పాటు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)ను కూడా నిషేధించింది. ఈ రెండింటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి ఈ నిషేధం విధించింది కేంద్రం. దీంతో…
Senior Cop K Vijay Kumar Resigns As Security Advisor Of Home Ministry: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను అంతమొందించడంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ పోలీస్ అధికారి కే. విజయ్ కుమార్ హోం మంత్రిత్వ శాఖ సీనియర్ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల విజయ్ కుమార్ రాజీనామా చేసినట్లు తెలిసింది. ఢిల్లీలోని తన నివాసాన్ని ఖాళీ చేసి చెన్నైకి మకాం మార్చారు విజయ్ కుమార్. తన పదవీకాలం…
AP Bifurcation Bill: ఈనెల 27న ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఏపీ విభజన చట్టం అమలుపై చర్చించనుంది. ఈ సమావేశం ఏజెండాలో మొత్తం 14 అంశాలు ఉన్నాయి. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈనెల 27న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ…
డిసెంబర్ 15 తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు పున: ప్రారంభం అవుతాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి మరియు ఇతర దేశాలతో షెడ్యూల్ చేయబడిన వాణిజ్య అంతర్జాతీయ విమాన సేవలను పునఃప్రారంభించే విషయాన్ని, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి…