హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంచార్జి మంత్రులను నియమించింది. 17 నియోజక వర్గాలకు 17 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెండు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పీఏసీ.