విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుపై తన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
Family doctor implements from august 15th in andhra pradesh: ఏపీలో వచ్చేనెల 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ వెల్లడించారు. మంగళగిరిలో సోమవారం నాడు వైద్య ఆరోగ్యశాఖపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలకు వెళ్లే వైద్యుల వద్ద ప్రతి రోగి ఆరోగ్య కార్డు ఉంటుందన్నారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, పీహెచ్‌సీలకు అనుబంధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతుందని మంత్రి…
నేషనల్ హెల్త్ మిషన్ విభాగం ఉన్నతాధికారులతో మంత్రి విడదల రజనీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పని చేస్తోందని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లక్ష్యాలు పూర్తి కావాలని, అన్ని విభాగాల్లోనూ ఏపీనే ముందుండాలని ఆమె అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు ఉండటానికి వీల్లేదని,…
విశాఖలో జరిగిన వైసీపీ సమన్వయ కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తల ధైర్యం సీఎం జగన్మోహన్‌రెడ్డేనని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విశాఖలో వైసీపీ జెండా ఎగరేస్తామని.. విశాఖను తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని ఆమె వివరించారు. గతంలో విశాఖ ఎలా ఉందో. ఇప్పుడు విశాఖ…
సీఎం వైఎస్ జగన్ వల్లే బీసీలకు గుర్తింపు వచ్చింది.. ఏపీ సీఎంకు జీవితాంతం బీసీలు తోడుగా ఉంటారని వ్యాఖ్యానించారు మంత్రి విడదల రజిని.. గుంటూరులో జరిగిన ముదిరాజ్ మహాసభ సన్మానానికి హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం జగన్ వల్లే బీసీలకు గుర్తింపు వచ్చింది.. బీసీలకు ఇచ్చిన గుర్తింపును నిలబెట్టుకుంటామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్పొరేషన్లు, 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని ప్రశంసలు కురిపించిన ఆమె.. ప్రభుత్వ పథకాల్లో ఎక్కువగా లబ్ధిపొందుతున్నది బీసీలే…
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన జరిగింది. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90 కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి…
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు. పేషెంట్లను అడిగి వైద్యం అందుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు మంత్రి విడదల రజిని, కృష్ణ బాబు. ప్రతి డిపార్ట్మెంట్ ని పరిశీలించిన మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. అత్యవసర విభాగంలో ఏసీ పని చేయకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి విడదల రజిని. అత్యవసర విభాగంలో ఏసీ పనిచేయకపోవడంపై ఏఈని…
ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి విడదల రజనీ… సచివాలయంలో తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు.. తన పిల్లలతో కలిసి సచివాలయానికి వచ్చిన ఆమె వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్‌గా నిలుస్తోందని.. ఏపీలో అందుతున్న వైద్య సేవల పట్ల కేంద్రం నుంచి ప్రశంసలు అందుతున్నాయని వెల్లడించారు. Read Also: Harish Rao:…