Minister Vemula Prashanth Reddy Reviews Construction Of Police Command Control Centre: హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ప్రపంచస్థాయి కట్టడాల్లో ఒకటిగా నిలవనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దీన్నొక అద్భుత నిర్మాణంగా అభివర్ణించిన ఆయన.. దుబాయ్‌కి బూర్జ్ ఖలీఫా, ప్యారిస్‌కు ఈఫిల్ టవర్ ఎలాగో.. హైదరాబాద్‌కు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంతటి కీర్తిని తెస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ 14వ అంతస్తు నుండి చూస్తే..…
నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం దేవక్కపేట్ గోనుగొప్పుల గ్రామాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని బండి సంజయ్ అమిత్ షా ను అడగాలన్నారు. పాదయాత్రలో కర్ణాటక ప్రజలు తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు కావాలని బండికి వినతి పత్రం ఇచ్చారు. నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా మీటింగ్…
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఆదివారం చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నడ్డా…కాంగ్రెస్ రాహుల్ గాంధీ మిడతల దండులా తెలంగాణ మీద పడ్డరంటూ విమర్శలు చేశారు. పచ్చబడుతున్న తెలంగాణను ఆగం చేయాలనుకుంటున్నారా.. అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు..? అని ఆయన ప్రశ్నించారు. కరెంట్ ఇస్తలేరని బీహార్‌లో రైతులు ట్రాన్స్ఫార్మర్ తగులబెట్టారు అని, దేశ చరిత్రలోనే…
కేంద్ర ప్రభుత్వం నేడు రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నేషనల్ హైవే పథకాలకు నిధులు మంజూరు చేయడంపై జరిగిన కార్యక్రమంలో ఎక్కడ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ని బీజేపీ అడ్డుకున్నది లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ అడ్డుకున్నది అని చెప్పడం పచ్చి అబద్ధమని, దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వడం లేదు అని ఒక పక్క పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న రాష్ట్ర…
తెలంగాణ రాష్ట్రంలో 10 NH ప్రాజెక్ట్‌లు, 7 CRF పనుల భూమిపూజ, 2 NH ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు వచ్చిన గడ్కరీకి సీఎం కేసీఆర్ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 2014 నుండి 2525 కిలోమీటర్ల పొడవును జోడించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో NH నెట్‌వర్క్‌ను మెరుగుపరచినందుకు, వార్షిక ప్రణాళిక 2021-22లో 613 కి.మీ పొడవుతో 6211 కోట్ల విలువైన 15 NH ప్రాజెక్ట్‌లను మంజూరు చేసినందుకు…
యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా క్వింటల్ ధాన్యానికి ధర రూ.1960గా నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తన బాధ్యత విస్మరించినా.. రైతు మీద ప్రేమతో ముఖ్యమంత్రి కేసిఆర్ ధాన్యం సేకరణ చేస్తున్నారని ఆయన అన్నారు. యాసంగి ధాన్యం నూక శాతం నష్ట భారం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని…
Minister Vemula Prashanth Reddy made comments on TS BJP Chief Bandi Sanjay. తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్‌ఎస్ మంత్రులు ఢిల్లీకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో జరిగిన భేటీ అనంతరం తెలంగాణ మంత్రులు హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ… బండి సంజయ్ మెడకి…నాలుకకు లింక్ కట్ అయినట్టు ఉంది…
Telangana Minister Vemula Prashanth Reddy Fired on Union Minister Piyush Goyal. ఇటీవల తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయండపై కేంద్రం ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఈ నేథ్యంలో ఢిల్లీకి వెళ్లొచ్చిన మంత్రులు నేడు మీడియా సమావేశం నిర్వహించి ఢిల్లీలో కేంద్రంతో జరిపిన చర్చలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు నిరవధిక వాయిదా పడ్డాయి. నేడు సభలో సీఎం కేసీఆర్ 111 జీవో ఎత్తేస్తామని ప్రకటించారు. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. గతంలో త్రాగునీటి అవసరాల కోసం అక్కడ 111 జీవోను అమలు చేశారని, కానీ ఇప్పుడు ఆ రిజర్వాయర్ల ద్వారా త్రాగునీటి అవసరం లేదు కనుక ఇబ్బంది లేదన్నారు. 111జీవో పై సీఎం సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 84 గ్రామాల పరిధిలో దీనితో మేలు…
Minister Vemula Prashanth Reddy about Telangana Assembly Budget Sessions 2022. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆఖరి రోజు సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగాయని ఆయన అన్నారు. శాసన సభ 54…