Minister Vemula Prashanth Reddy made comments on TS BJP Chief Bandi Sanjay.
తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్‌ఎస్ మంత్రులు ఢిల్లీకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో జరిగిన భేటీ అనంతరం తెలంగాణ మంత్రులు హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ… బండి సంజయ్ మెడకి…నాలుకకు లింక్ కట్ అయినట్టు ఉంది …ఏది పడితే అది మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా బండి సంజయ్ మొగోడు అయితే కేంద్రంతో వరి ధాన్యం కొనుగోలు చేయించాలని ఆయన సవాల్ విసిరారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దారి తప్పుతున్నారు.. మీ గౌరవం కాపాడుకోండని ఆయన వ్యాఖ్యానించారు. పీయూష్ గోయల్…మా ముందే కిషన్ రెడ్డి ని మీటింగ్ కు రావాలని ఫోన్ చేసారు…కానీ మా మీటింగ్ కు రాలేదన్నారు. ఎవరు ధాన్యం కొనుగోలు చేయాలో రేవంత్ రెడ్డికి తెలియదా ? కేసీఆర్ వడ్లు కొనాలని రేవంత్ అంటాడు.. కేంద్రంను తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని రేవంత్ ఎందుకు అడగడు ? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ లు ములాఖత్ అయ్యాయా.. బీజేపీని అడగకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం రేవంత్ చేస్తున్నాడని ఆయన విమర్శించారు.