Minister TG Bharath: మళ్లీ వస్తా.. ఆస్పత్రి రూపురేఖలు మారిపోవాలి.. సూపరింటెండెంట్‌కు మంత్రి వార్నింగ్
- కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు మంత్రి టీజీ భరత్ వార్నింగ్.. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన మంత్రి..
- ఆస్పత్రిలో సరైన వసతులే లేకపోవడంపై సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister TG Bharath: మళ్లీ వస్తా.. ఆస్పత్రి రూపురేఖలు మారిపోవాలి.. లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వార్నింగ్ ఇచ్చారు మంత్రి టీజీ భరత్.. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన ఆయన.. ఆసుపత్రిలో అపరిశుభ్రత తాండవిస్తోంది.. వార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి.. తాగునీటి సమస్య ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.. అంతే కాదు.. ఆస్పత్రికి వచ్చే రోగులకు.. మందులు, టెస్ట్‌లు బయటికి రాస్తున్నట్లు తెలిసిందని.. ఇది సరైన విధానం కాదన్నారు.. ఆసుపత్రిలో కరెంట్ కోతలు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లల విభాగంలో ఐదేళ్లుగా ఏసీలు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. టీజీవీ వాటర్ ప్లాంట్ లు సొంతంగా ఏర్పాటు చేస్తే.. చెడిపోయినా, నీరు రాకపోయినా మరమ్మతులు చేయించరా? అంటూ ఆస్పత్రి అధికారులపై మండిపడ్డారు.. మళ్ళీ ఆసుపత్రికి వస్తా.. ఆసుపత్రి తీరు మారాలని సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరించారు మంత్రి టీజీ భరత్.. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు తీరుస్తాం.. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తాం అన్నారు.. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ పాలకులు ఏమాత్రం జీజీహెచ్ ను పట్టించుకోలేదు అని విమర్శించారు మంత్రి టీజీ భరత్.
Read Also: TEA: మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే!
Also Read
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!