తన ప్రమేయం లేకుండా జరగాల్సినది జరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ మారే ఆలోచన ఇప్పటివరకు ఐతే లేదని..బీజేపీ నుంచి ఎవరు తనను సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. తన నిర్ణయం తాను తీసుకోవాలని తనకు పార్టీ నుంచి సంకేతం అందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి శ్రీధర్ బాబు వచ్చి మాట్లాడారని..డిప్యూటీ సీఎం కూడా నాతో చర్చించారన్నారు.ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరిగేందుకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానన్నారు. తనతో కాంగ్రెస్ ఇంచార్జీ మున్షీ మాట్లాడారని వెల్లడించారు. నిన్నటి నుండి మంత్రులూ టచ్ లో ఉన్నారని చెప్పారు. ఏ పార్టీ నుంచి తనకు కాల్స్ రాలేదని తెలిపారు. కాగా..సోమవారం మంత్రి శ్రీధర్ బాబు,విప్ లు ధర్మపురి వేములవాడ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయి తొందరపడద్దని బుజ్జగించే ప్రయత్నం చేశారు.
తాజాగా జీవన్ రెడ్డి ప్రకటన అనంతరం ఆయనను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమయ్యారు. జీవన్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రి శ్రీధర్ బాబు చేరుకున్నారు. బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి ఆయనకు నచ్చచెప్పేందుకు యత్నిస్తున్నారు. కొద్ది సేపట్లో ఆయన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. కాగా..కనీసం సమాచారం అందించకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.