D. Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో రాత్రి ఓ వాణిజ్యసముదాయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సరదాగా కాసేపు గడిపారు. కరీంనగర్ కు వెళ్తూ మంథని అంబేద్కర్ కూడలిలో కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు. అక్కడ కూడలిలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్లో కి వెళ్లారు. శ్రీధర్ బాబును చూసిన అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. శ్రీధర్ బాబును చూసిన అక్కడున్న వారందరూ పలకరించేందుకు దగ్గరకు వచ్చారు. అయితే అక్కడకు వచ్చిన స్థానికులతో సమానంగా అక్కడే ఒక స్టూల్ మీద కూర్చుని వారందరితో సరదాగా మాట్లాడారు. మీ షాప్ లో ఏమున్నాయి అంటూ అడిగి ఇడ్లీ తిన్నారు. అనంతరం అక్కడే కూర్చుకుని, టీ తాగి వ్యాపారస్తులతో కొద్దిసేపు చిట్ చాట్ చేశారు. వ్యాపారంలో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు వున్నాయా? కాంగ్రెస్ పాలనలో అన్ని మంచిగానే సాగుతున్నాయా అంటూ ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
Read also: SSMB29 : సినిమాలో మహేష్ పాత్ర అలా ఉండబోతుందా..?
అకస్మాత్తుగా శ్రీధర్ బాబు తమ కొట్టు లోకి రావడంతో యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక వ్యాపారస్తులతో మాట్లాడుతూ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయని కుశల ప్రశ్నలు అడిగి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని వ్యాపారస్తులకు సూచించారు. అనంతరం టిఫిన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి తినిపించారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలిపి, సలహాలు సూచలు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికి సమానంగా న్యాయం చేస్తుందని, భయపడకండి ధైర్యంగా ఉండాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ కు బయలుదేరారు.
Dinesh Karthik Six: దినేష్ కార్తీక్ భారీ సిక్స్.. స్టేడియం బయట బంతి! వీడియో వైరల్