Minister Seethakka:పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. వివిధ అభివృద్ధి పనులలో పాల్గొనడంతో పాటు, పలు గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించనున్నారు. ములుగు ఇంచెర్ల గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ అభినందన సభలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భాగంగా పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు గుండా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలోని గోవిందరాజుల ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Read also: Pending Challans: మూడురోజులే గడువు.. పెండింగ్ చలాన్లు కట్టని వారు కట్టేయండి బాబు..
మేడారం మహాజాతరకు 25 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ బాధ్యతను సీతక్క మూడురోజులుగా అక్కడే మకాం వేసి పరిశీలిస్తున్న విషయం తెలసిందే. అయితే.. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతర ఏర్పాట్లలో వేగం పెంచింది. ఈ నెల 31లోగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ ఇచ్చారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం మహాజాతర జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.
మహాజాతరలో అమర్చిన సీసీ ఫోటేజ్ ను సీతక్క పరిశీలించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈసారి జాతరకు ఆరు రాష్ట్రాల నుంచి 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కొత్తూరు సమీపంలోని వీఐపీ పార్కింగ్, ఆర్టీసీ బస్టాండ్, హరిత హోటల్, జంపన్న వాగు స్నాన ఘాట్లు, స్థూపం రోడ్డు, మరుగుదొడ్లను పరిశీలించారు. కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ ఆలయ పరిసరాలను పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీరు, లైటింగ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, వసతులు కల్పించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోను జాతరలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కోరారు.
Pending Challans: మూడురోజులే గడువు.. పెండింగ్ చలాన్లు కట్టని వారు కట్టేయండి బాబు..