Minister Seethakka – KTR: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రస్తుత మంత్రి సీతక్క మండి పడ్డారు. ఇందులో భాగంగా గత 10 ఏళ్లలో కేటీఆర్ ఎప్పుడైనా ఓయూకి వెళ్ళాడా.? కేటీఆర్ మాటలు.. కోట శ్రీనివాస్ రావు కోడి కథ లెక్క ఉందని ఆమె మండి పడింది. డబుల్ పించన్ మీ హయంలో తీసుకున్న వాళ్ళు కేవలం 5 వేల పై చిలుకు మాత్రమే అని., మళ్లీ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్…
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వల్లే తన తల్లిదండ్రులకు పోడు భూమి యాజమాన్యం దక్కిందంటూ బీఆర్‌ఎస్ సభ్యుడు అనిల్ కుమార్ జాదవ్ చేసిన వ్యాఖ్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డీ అనసూయ అలియాస్ సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం పట్టా, ఏ దయ వల్ల కాదని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోడు భూముల యజమానులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడంతో సీతక్క తల్లిదండ్రులు గతేడాది ములుగు మండలం జగ్గన్నపేట…
Minister Seethakka fire on IAS Smita Sabharwal: తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై ఫైర్ అయ్యింది. స్మిత అలా మాట్లాడకుండా ఉండాల్సిందని., ఒక అధికారిగా ఉండి అలా మాట్లాడటం తప్పని., ఐపిఎస్ కి ఫిజికల్ ఫిట్ నెస్ అవసరం అంటూ కాస్త ఘాటుగా మాట్లాడింది. ఇక ఈ విషయం సిఎం దృష్టిలో ఉండి ఉంటదని., వైకల్యం కంటే.. బుద్ధి వైక్యల్యం ప్రమాదం అని సీతక్క అన్నారు. ఇక ఇదివరకు…
ములుగు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అడిషనల్ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓ, ఎంపిఓలతో మంత్రి రివ్యూ చేపట్టారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని తెలిపారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకల వద్ద…
ఆసరా పెన్షన్ను తిరిగి చెల్లించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి అధికారులు నోటీసులు ఇవ్వడంపై మంత్రి సీతక్క స్పందించారు. కొత్తగూడెం మున్సిపాలిటికి చెందిన దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పెన్షన్ అందుతోందని తెలిపారు. అయితే దాసరి మల్లమ్మ కుమార్తె రాజేశ్వరి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం(ANM) గా పనిచేస్తూ మరణించగా, ఫ్యామిలి పెన్షన్ కింద నెలకు రూ. 24,073 పెన్షన్ మల్లమ్మకు అందుతోందని మంత్రి పేర్కొన్నారు.
సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరు, అందుతున్న సేవలపై జిల్లా అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. త్వరలోనే మహిళలకు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుందని అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఆమె ప్రారంభించారు.