సోషల్ మీడియాలో ఓ చిన్నారి పై కొందరు యవకులు జుగుప్సాకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటనపై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేసారు.
మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై అధికారుల నుంచి నివేదిక కోరారు. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
హన్మకొండ జిల్లా దొడ్డి కొమురయ్య వర్ధంతి, రణధీర సీతక్క పుస్తక ఆవిష్కరణ పరిచయ వేదిక హన్మకొండ జెడ్పి కార్యాలయం లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నేను చదువుకుంటున్న రోజులలో నక్సలైట్ అవుతాను అనుకోలేదన్నారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయంలోకి వచ్చానని, విప్లవ ఉద్యమం నుంచి ప్రజా సేవకొచ్చానన్నారు. పేదలను అసహ్యహించుకునే వాళ్లు రాజకీయలలో ఎక్కువ ఉంటారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. పేదరిక నిర్మూలన జరిగితేనే…
Minister Seethakka: అల్లూరి విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. ట్యాంక్ బండ్ మీద జరుగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో సీతక్క పాల్గొన్నారు.
Minister Seethakka: ఆదివారం కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు కావలసిన నిధులు ఎక్కడ ఆగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడిని ఉపయోగిస్తామని ఆవిడ చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్న వారందరూ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలని ఆవిడ తెలియజేశారు. కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిన డి. శ్రీనివాస్ మృతి తనకి తీవ్ర ఆవేదనను కలగజేసిందని…
సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో మంత్రి సీతక్క కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ని తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కలిశారు. తెలంగాణలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కోరారు.
మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. గంజాయి ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడుతామని ఆమె అన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆమె వ్యాఖ్యానించారు. భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని, అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు మంత్రి సీతక్క. అన్ని శాఖల…
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20 వేల కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు.
Schools Reopen: నిన్నటితో వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే.. మొదటి రోజునే విద్యార్థులకు కొత్త యూనిఫారాలు అందించే..
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.