Telangana Govt: అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్‌లకు పదవీ విరమణ ప్రయోజనాలను అందజేస్తామన్నారు. ఈ మేరకు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ‘అమ్మ మాట – అంగన్ వాడీ బాట’లో భాగంగా హైదరాబాద్ రహ్మత్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందజేస్తామన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో జీవో విడుదల చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Read also: Mayor Sunil Rao: బండి సంజయ్ ను కలిస్తే తప్పేముంది.. మంత్రి పొన్నం పై మేయర్ ఫైర్..
ఇందులో భాగంగా మొదటి దశలో ప్రభుత్వ పాఠశాల భవనాల్లోని సుమారు 15 వేల అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వాటిని ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తున్నారు. వాటిని ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే తీసుకొచ్చారు. కాగా.. జియో 10 రద్దు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. జులై 15న సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్ వాడీలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను, ఎమ్మెల్యేలను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇవాళ ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో అంగన్ వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Mallu Bhatti Vikramarka: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలి..