Minister Seediri Appalaraju: చంద్రబాబు అరెస్ట్‌ను రాజకీయ కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ యువకులకు సంబంధించిందని.. ఎవరికీ ట్రైనింగ్ ఇవ్వకుండా , ఇన్‌స్టిట్యూట్ కట్టకుండా డబ్బులు కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. అవినీతి జరిగిందా లేదా అనేది చూడాలన్నారు. అవినీతి చేసిన వారు ఎవరైనా శిక్షింపబడాల్సిందేనన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ కంటే దత్తపుత్రుడు పవన్ ఓవర్ యాక్షన్ ఎక్కువైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సినిమాలలో కూడా అంత ఓవర్ యాక్షన్ చేయలేదన్నారు. దేశంలోనే మొదటిసారి నేరుగా ప్రభుత్వ ధనాన్ని సొంతఖాతాల్లో వేసుకున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఇంత కంటే అతిపెద్ద స్కామ్ ఎక్కడా ఉండదన్నారు. వ్యవస్థలోని లొసుగులు ఉపయోగించుకొని డబ్బును ఖాతాలో వేసుకున్నారన్నారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి అయినా పెట్టారా అంటూ మంత్రి ప్రశ్నించారు. Apssdc ఏర్పాటు అన్నది కేబినెట్‌కు కూడా రాలేదన్నారు. బిజినెస్ రూల్‌కి వ్యతిరేకంగా అంతా చేశారన్నారు.
Also Read: Chandrababu Naidu Arrest Live Updates : చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌పై వాదనలు
మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. “చంద్రబాబు మోస్ట్ స్కిల్డ్ క్రిమినల్ ఇన్ ఇండియా. విదేశాలలోని కంపెనీలకు ఫేక్ ఇన్‌వాయిస్‌లు పెట్టారు. వ్యవస్థలను ఎలా అయినా మేనేజ్ చేయగలనని చంద్రబాబు భావిస్తారు. చంద్రబాబు ఎప్పుడు తప్పు చేయనని చెప్పడు. నిరూపించుకోండి అంటుంటారు.? క్యాబినెట్ నిర్ణయాలను ఎలా తప్పు బడతారని చంద్రబాబు కోర్టులో ఎదురు ప్రశ్నిస్తున్నారు.మరి వైఎస్ హయాంలో జగన్ సహచరుడు, మంత్రి, ఎమ్మెల్యే కూడా కాదు. నాడు ఎలా ప్రత్యేకంగా రిట్ పిటిషన్లు వేశారు. క్విడ్ ప్రోకో అని బాబు చేసిన రాద్దాంతం మర్చిపోలేదు. 14 ఏండ్లలో మీరు నేర్చుకున్న రాజనీతి ఇదేనా బాబు?. స్కిల్ స్కాంలో బాబు అడ్డంగా దొరికిపోయాడు. చంద్రబాబు హయాంలోని అధికారి పేపర్ మీద నీట్‌గా పెట్టారు. రాజకీయ వైరుధ్యం ఎక్కడా లేదు. చంద్రబాబు లాయరే ఆయన తప్పుచేయలేదని చెప్పలేదు. ప్రోసీజర్ పాటించలేదన్నారు లాయర్. చంద్రబాబు సింపతీ కొసం తెగ ట్రై చేశారు. సాధారణ ప్రజలు ఒక్కరంటే ఒక్కరు కూడా సానుభూతి చూపించలేదు.” అని ఆయన పేర్కొన్నారు.
పవన్ ఒకసారి అయినా జనసైనికుల మనోవ్యథను ఆలకించాలని మంత్రి పేర్కొన్నారు. జనసైనికుల కష్టాన్ని పవన్ డబ్బులుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. పార్టీని మూసేసి, సినిమాలు తీసుకోవడం ఉత్తమమన్నారు. పవన్ రాజకీయాలకు సరిపోడన్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా కమ్యూనిస్టులు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని. కేవలం ఏపీలోనే చంద్రబాబు లాంటి వ్యక్తులకు కమ్యూనిస్టులు సహకరిస్తున్నారన్నారు. పవన్ తీరు ఇలా ఉంటే అసెంబ్లీ గేటు కూడా దాటలేరన్నారు.