పుట్టిన రోజు వేళ మంత్రి ఆర్ కె రోజా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. తన జన్మదినం కావడంతో స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చానన్నారు రోజా. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. యాక్టింగ్ చెయ్యడాన్ని తాను ఎప్పుడూ తప్పు పట్టలేదని.. నా కూతురు,కొడుకు నటిస్తానంటే తప్పకుండా స్వాగతిస్తానని..ప్రస్తుతానికి వారికి ఆ ఉద్దేశం లేదని రోజా తెలిపారు.రోజాతో పాటు శ్రీవారిని దర్శించుకున్నవారిలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకట్‌రెడ్డి ఉన్నారు.
Read Also: Drugs Mafia: డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్‌కు బెయిల్
మంత్రి అయ్యాక రోజా తొలిసారి జరుపుకుంటున్న పుట్టినరోజు కావడంతో ఆమె ఉత్సాహంగా వున్నారు. పుట్టినరోజు సందర్భంగా మంత్రి రోజాకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి దివ్య రూపం ఎన్ని సార్లు చూసిన మర్చిపోలేనిదన్న రోజా… తన కూతురు సైంటిస్టు అవ్వాలనే ఆలోచన ఉందన్నారు. మరోవైపు సినీనటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ మృతి తనను కలచివేసిందన్నారు రోజా. మంత్రి రోజా కూడా కృష్ణను చివరి చూపు చూసి నివాళులు అర్పించారు.
కృష్ణ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన రోజా కన్నీటి పర్యంతం అయ్యారు. కృష్ణ గారితో నటించిన గత జ్ఞాపకాలను ఆమె నెమరవేసుకున్నారు. క్రమ శిక్షణకు, వృత్తిపట్ల అంకితభావానికి కృష్ణ పెట్టింది పేరన్నారు రోజా. కృష్ణ లేరు అనే వార్త ను జీర్ణించుకోలేకపోతున్నా అన్నారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన ఎన్టీఆర్.. ఏయన్నార్.. కృష్ణం రాజు.. కృష్ణ గారు చనిపోవడం ఆవేదన కలిగిస్తుందని రోజా అన్నారు. నాకు చిన్నప్పటి నుండి కూడా కృష్ణ అంటే అమితమైన అభిమానం. హీరోయిన్ అయిన తర్వాత ఆయనతో నటించే అవకాశం వచ్చిందని, అప్పుడెంతో సంతోషించానన్నారు. కృష్ణ లేని లోటు తీర్చలేనిదన్నారు రోజా.
Read Also: Drugs Mafia: డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్‌కు బెయిల్