Minister Narayana: ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళతాళాలతో మంత్రి నారాయణ తన ఛాంబర్‌లోకి వచ్చారు. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్‌లో విధులు నిర్వహించారో.. అదే ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. మంత్రి నారాయణ ఛాంబర్‌లో పండితులు వేదాశీర్వచనం అందజేశారు. మంత్రి నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ స్వాగతం పలికారు. కాసేపట్లో వైద్యారోగ్య శాఖ సత్య ప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు రోజుల క్రితం మంత్రి పార్దసారథి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
Read Also: Success Story: అప్పుడు రూ.250 జీతానికి పని చేశాడు.. ఇప్పుడు లక్ష కోట్ల విలువైన కంపెనీకి యజమాని..
శనివారం ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి అభివృద్ధి బాధ్యతను చంద్రబాబు తనపై ఉంచారని వెల్లడించారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని అన్నారు. అమరావతిలో అనేక భవనాల నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయిందని నారాయణ తెలిపారు. పక్కా ప్రణాళికతో రెండున్నర సంవత్సరాల్లోనే ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని వెల్లడించారు.