సింహపురి పాలిటిక్స్ సరికొత్తగా కనిపించబోతున్నాయా? పగ పగ అని రగిలిపోతూ....పంతం నీదా? నాదా? సై.... అంటున్న టీడీపీ కార్యకర్తల్ని మంత్రిగారు చల్లబరుస్తున్నారా అంటే అవునన్నదే పరిశీలకుల సమాధానం. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. రెండోసారి కేబినెట్ బెర్త్ దక్కినప్పటి నుంచి అటు అమరావతితో పాటు ఇటు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారట ఆయన. నెల్లూరు సిటీలో రోడ్లు, పార్కుల ఏర్పాటు, వైసీపీ హయాంలో…