గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ నిన్న జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఆయన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్‌ను ఆహ్వానించారు. టిడిపి, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డప్పులతో, బాణసంచాలతో అంగరంగ వైభవంగా మొదలైన…
రెడ్ బుక్‌లో పెట్టిన పేర్లపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. గతంలో గన్నవరంలో ఓ దళితుడిని కిడ్నాప్ చేసి టీడీపీ ఆఫీస్ మీద కేసులు విత్ డ్రా చేయించిన వారిపైనే ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు లోకేష్. ఆ కేసుల వల్లే మాజీ శాసనసభ్యుడు జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు.
జేఈఈ టాపర్ మనోజ్ఞను అభినందించారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం, ఎటువంటి దగ్గర దారులు ఉండవు అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.. JEE (Mains) - 2025లో నూటికి నూరుశాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను అభినందించారు లోకేష్..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా వచ్చి కార్మికులతో మాట్లాడి హామీ ఇచ్చినా.. ఇంకా అనుమానాలు ఎందుకు? అని ప్రశ్నించారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితికి కారణం గత 10 ఏళ్లలో సంస్ద యాజమాన్యం విచ్చలవిడిగా, అనాలోచితంగా తీసుకున్న పలు నిర్ణయాలే అన్నారు.. కానీ, కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా వచ్చి కార్మికులతో…
ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లనున్న నారా లోకేష్.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఈ రోజు రాత్రికి భేటీ కానున్నారు. ఇటీవల రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి నిధులు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలపనున్నారు.
సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలన్నాదని మాజీ మంత్రి రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించ లేదన్నారు. ఫీజులు చెల్లించ లేక విద్యార్థుల పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క రూపాయి చెల్లించలేదని ఆరోపించారు.
తాను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు మంత్రి నారా లోకేష్.. "మన మిత్ర" పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్‌తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు.
ఏపీ ప్రభుత్వం దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009ను కేటాయించింది. దీని ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందించనుంది.. ఒకేముందు.. 95523 00009ను సేవ్ చేసుకోండి.. మీకు కావాల్సిన సేవను అందుకోండి..
ప్రజలకు మరింత చేరవగా సేవలు అందించేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది కూటమి ప్రభుత్వం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉండవల్లిలోని ప్రజావేదికలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ టీమ్ దావోస్ పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ఓ కేసులో కోర్టులో హాజరుఅయ్యేందుకు విశాఖ వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడు నెలలలో ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు..