విజయనగరం జిల్లాలో ఓ హెచ్‌ఎం విద్యార్థులకు స్టేజ్ పై నుంచి సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి.. క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
Minister Lokesh: వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పుకు శ్రీకారం చుట్టింది. కొత్త యూనిఫామ్లకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ఈ యూనిఫాం రూపొందించాలన్నారు.
ఆర్కియాలజీ లైబ్రరీల గురించి అసెంబ్లీలో ప్రశ్నోత్నరాల సమాయంలో చర్చ సాగింది.. రాష్ట్ర విభజన జరిగినప్పుడు.. ఆస్తి, అప్పుల విభజనలో ఏపీకి ఆర్కియాలజీ లైబ్రరీకి సంబంధించి సాంస్కృతిక సంపద పూర్తిగా రాలేదని లేవనెత్తారు జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్.. ప్రభుత్వం వెంటనే ఆర్కియాలజీ శాఖ లైబ్రరీపై దృష్టి పెట్టాలని కోరారు.. ఇక, మండలి బుద్ధ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ.. రాష్ట్ర విభజన తర్వాత 50 శాతం ప్రాచీన పత్రాలు రాష్ట్రానికి…
ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాం.. బలహీనవర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటాం అన్నారు లోకేష్.. ఇక, యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రెడ్‌బుక్‌పైనే చర్చ సాగుతోంది.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసీపీని విమర్శిస్తోంది.. అయితే, రెడ్‌బుక్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్..
వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వండి, ఇప్పుడే విచారణకు ఆదేశిస్తా, అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. 19 మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. వైస్ చాన్సలర్లను మేం బెదిరించడం ఏమిటి? గవర్నర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు నడుస్తాయి. ఎవరు బెదిరించారో చెప్పమనండి.
కూటమి సర్కార్‌కు సవాల్ విసిరారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. పులివెందుల ఉప ఎన్నిక కాదు.. సూపర్ సిక్స్ పథకాలు రెఫరండంతో మంగళగిరి, పిఠాపురం, కుప్పం నియోజకవర్గాల్లో ఎన్నికలకు మీరు సిద్ధమా? అని ఛాలెంజ్ విసిరారు.
హిందూ ధర్మం సనాతన ధర్మం.. మానవ సేవే మాధవ సేవ.. సాటి మనుషులకు, సమాజానికి సేవ చేస్తే, ఆ దేవుడికి సేవ చేసినట్టేనని హిందూ ధర్మం చెబుతోందన్నారు మంత్రి నారా లోకేష్. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ మరియు ఎక్స్‌పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుందన్నారు..
వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్వవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులతో వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం ఉంటుందన్నారు లోకేష్.
మహా కుంభమేళాలో ఏపీ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు.. ఈ సందర్భంగా తన భార్య, కుమారుడితో కలిసి దిగిన సెల్ఫీని మంత్రి లోకేష్ షేర్ చేయడంతో వైరల్‌గా మారిపోయింది..