Minister Nara Lokesh: ఓవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు చర్యలు తీసుకుంటుంది.. ఇక, ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం యువత, పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా నైపుణ్యం పోర్టల్ ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.. సెప్టెంబర్‌లో నైపుణ్యం పోర్టల్ ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు..
Read Also: JK: “తినేది భారత్ సొమ్ము.. పని చేసేది పాక్ కోసం..” ఉగ్రవాదులకు సపోర్ట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు…
పీఎం ఇంటర్నషిప్ స్కీమ్‌తో నైపుణ్యం పోర్టల్ ను అనుసంధానించాలని సూచించారు నారా లోకేష్. నైపుణ్యం పోర్టల్ డెమోను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పరిశీలించారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పోర్టల్ ను అభివృద్ధి చేయలేదన్నారు లోకేష్.. రాష్ట్రంలోని నైపుణ్య కేంద్రాలతో పాటు న్యాక్, సీడాప్ ను పోర్టల్ తో అనుసంధానించనున్నట్లు అధికారులు వివరించారు. ఏడాదికి 50 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 36 రంగాలకు సంబంధించి 3 వేలకు పైగా జాబ్ కేటగిరీలను పోర్టల్‌లో ఎన్ రోల్ చేసినట్లు అధికారులు వివరించారు.. పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా యువతను సన్నద్ధం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఇదే సమావేశంలో ఇంటర్ విద్యకు సంబంధించిన పలు అంశాల పై చర్చించారు. దృష్టి లోపం గల విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు అనుమతి మంజూరు చేసారు. వారికి మరిన్ని సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..