HBD Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టినా.. తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్.. తాను అంటే చెప్పలేనంత ఫాలోయింగ్ సంపాదించుకున్నారు పవన్ కల్యాణ్.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఆయన.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగే .. ఇక, ఈ ఏడాది పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే ప్రత్యేకమనే చెప్పాలి.. సినీ గ్లామర్‌తో పాలిటిక్స్‌లోకి వచ్చిన ఆయన.. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీతో జతకంటి.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఎనలేని కృషి చేశారు.. అయితే, ఈ రోజు పుట్టిన రోజు జరుపుకోంటున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎంకు అటు సినీ ప్రముఖులు.. ఇటు రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా ఇతర మంత్రులు పవన్ కు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు..
పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు ప్రధాని మోడీ.. “శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన లెక్కలేనంత మంది హృదయాల్లో, మనసుల్లో చెరగని ముద్ర వేశారు. సుపరిపాలనపై దృష్టి సారించడం ద్వారా.. ఆంధ్రప్రదేశ్‌లో NDAని బలోపేతం చేస్తున్నారు. ఆయన దీర్ఘాయుష్షుతో కూడిన ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను..” అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంచి పదాల అల్లికతో శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు.. “మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. అడుగడుగునా సామాన్యుడి పక్షం… అణువణువునా సామాజిక స్పృహ… మాటల్లో పదును… చేతల్లో చేవ… జన సైన్యానికి ధైర్యం… మాటకి కట్టుబడే తత్వం… రాజకీయాల్లో విలువలకు పట్టం….స్పందించే హృదయం…అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి…మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..” అని పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు..
ఇక, “వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..” అంటూ ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్..
“ప్రజలు మెచ్చిన స్టార్ పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాక్షాంక్షలు.. ఆవేశం, ఆలోచన కలగలిసిన నేత పవన్ కల్యాణ్.. ఎక్కడ తగ్గాలో…ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన నాయకుడు.. ప్రజల కోసం ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్.. ఆ ప్రజాసంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చేందుకు చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిరంతం ప్రజా సేవలో ఉండాలని.. ఈ పుట్టిన రోజు సందర్భంగా కోరుకుంటున్నా” అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు..
“జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం , ప్రజలకు స్ఫూర్తి నిచ్చే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. “సినిమా రంగంలో తన ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్ గారు, రాజకీయ రంగంలోనూ సాధారణ ప్రజల సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ధైర్యవంతుడైన నాయకుడిగా నిలిచారు. ప్రజల కోసం తపన పడే పవన్ కళ్యాణ్ గారు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ ముందుంటారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలని, ఆయన ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..” అంటూ మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు..
“జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్లే రథసారథులు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు”.. తెలిపారు డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి..
“ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో మరింతగా పునరంకితం కావాలని కోరుకుంటున్నాను.” అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విషెస్ చెప్పారు..
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంత్రి సవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. “నిస్వార్థ ప్రజా సేవకుడు పవన్ కల్యాణ్.. రాష్ట్రాభివృద్ధికే జన సేనాని తొలి ప్రాధాన్యం.. ప్రజా పోరాటంలో మిసైల్ లాంటి వ్యక్తి.. సినీ, రాజకీయ రంగాల్లో పవన్ చరిష్మా తిరుగులేనిది.. కూటమి ఏర్పాటులో పవన్ ది కీలక పాత్ర.. యువతకు నిత్య స్ఫూర్తి పవన్” అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సవిత.. ఇలా పలువురు మంత్రులు.. రాజకీయ ప్రముఖులు.. సినీ పరిశ్రమలోని హీరోలు, నటులు, హీరోయిన్లు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరోకి.. మెచ్చిన నాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు..
Best wishes to Shri Pawan Kalyan Ji on his birthday. He’s made a mark in hearts and minds of countless people. He is strengthening the NDA in Andhra Pradesh by focusing on good governance. Praying for his long and healthy life.@PawanKalyan
— Narendra Modi (@narendramodi) September 2, 2025
మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం… అణువణువునా సామాజిక స్పృహ… మాటల్లో పదును… చేతల్లో చేవ… జన సైన్యానికి ధైర్యం… మాటకి కట్టుబడే తత్వం… రాజకీయాల్లో విలువలకు పట్టం….స్పందించే హృదయం…అన్నీ కలిస్తే… pic.twitter.com/TqlmiEIwBZ
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2025
వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు… pic.twitter.com/QEKiv9mInU
— Lokesh Nara (@naralokesh) September 2, 2025