Nara Lokesh: కువైట్‌లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్నానంటూ ఓ తెలుగు కార్మికుడు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై స్పందించారు మంత్రి నారా లోకేష్.. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. వీడియోలోని వ్యక్తిని గుర్తించామని.. తెలుగుదేశం ఎన్ఆర్ఐ బృందం ఆయనను చేరుకుందని మంత్రి లోకేష్ తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
Read Also: KCR Petition: నేడు సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ.. సర్వత్రా ఆసక్తి
కాగా, అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. శివ సొంత ఊరు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు అయితే.. పెళ్లి తర్వాత జీవనోపాధి కోసం తన అత్తగారి ఊరు అయినటువంటి పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి ఇల్లరికం వచ్చాడు.. ఆ తర్వాత జీవనోపాధి కోసం గల్ఫ్ కంట్రీ కువైట్ కు వెళ్లాడు.. నెల క్రితం గొర్రె కాపరిగా చేరినట్టు తెలుస్తోంది.. అయితే అక్కడ అనేక ఇబ్బందులు పడి ఎడారిలో నీటి వసతి లేని చోట.. కరెంటు కూడా లేని చోట.. ఆ కువైట్ యజమాని పెట్టడంతో విధి లేని పరిస్థితిలో సోషల్ మీడియా ద్వారా.. వాట్సాప్ ద్వారా తన మనోవేదనను, బాధను వీడియో రూపంలో విడుదల చేశాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది.. ఇక, కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేష్.. శివను స్వగ్రామానికి రప్పించే విషయంపై చర్చించారు.. మొత్తంగా శివను స్వరాష్ట్రానికి రప్పిస్తామని హామీ ఇచ్చారు.
Read Also: EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న స్పెయిన్
ఇక, మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు నారా లోకేష్.. ప్రజాదర్భార్ నిర్వహిస్తూ.. స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.. తన సొంత నియోజకవర్గం మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎవరు తమ సమస్యలపై తన దగ్గరకు వచ్చినా.. సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్నారు.. మరోవైపు.. సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కూడా మంత్రి నారా లోకేష్ దృష్టిసారించిన విషయం విదితమే.