తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ‘తెలంగాణ రన్’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ దేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5కే, 2కే రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫీర్జాదిగూడ ముస్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల చౌరస్తాలో జరిగిన 5కే రన్‌లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తన డ్యాన్సులతో అందరిలో జోష్ నింపాడు. డీజే టిల్లు పాటకు విద్యార్ధులతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు.
Read Also : Biparjoy : తుఫాను కారణంగా ముంబైలో భారీ వర్షాలు.. PM అత్యవసర సమావేశం
చెంగిచెర్ల చౌరస్తాలో విద్యార్ధులతో కలిసి చిందులేస్తూ మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. విజేతలకు ఇచ్చే ట్రోఫీ పట్టుకుని డ్యాన్సులేశారు. అలాగే విద్యార్ధులు స్టేజీపై డ్యాన్సులు వేస్తుండగా.. వారిని మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం ఆయన చేశారు. అనంతరం అక్కడకు వచ్చిన మహిళా కళాకారులతో కలిసి బతుకమ్మ పాటలకు మల్లారెడ్డి ఆడిపాడారు. పలు పాటలకు మల్లారెడ్డి వేసిన స్టెప్పులు ఈ ప్రొగ్రాంలో హైలెట్ అయ్యాయి. ఫీర్జాదిగుడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, స్ధానిక కార్పోరేటర్లు, విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ రన్‌లో పాల్గొన్నారు.
Read Also : Ludhiana: మొత్తం కొట్టేసింది 7 కోట్లుకాదు.. ఎనిమిదిన్నర కోట్లు
ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మల్లన్న ఎక్కడ ఉంటే అక్కడ సందడే అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 70 ఏళ్ల వయస్సులో కూడా మల్లారెడ్డిలో ఉత్సాహం అసలు తగ్గడం లేదని మరో యూజర్ వ్యాఖ్యనించాడు. యువకుడిలా కనిపిస్తున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మల్లారెడ్డి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సరే.. అక్కడ తన మాటలు, డ్యాన్సులతో జోష్ నింపుతారు.. మల్లారెడ్డి ఏ పని చేసినా హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటుంది అని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.