ప్రముఖ ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ “ప్లగ్ అండ్ ప్లే” సంస్థ నిర్వహిస్తున్న ఈవెంట్ లో ఐటీ, పౌరసరఫరాల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ను వీక్షించండి.
తెలంగాణ మంత్రి కేటీఆర్ తన విధులతో ఎప్పుడూ బిజీగా కనిపిస్తుంటారు. ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటారు. ఒక్కోసారి మీట్ విత్ కేటీఆర్ పేరుతో సోషల్ మీడియాలో నెటిజన్‌లతో చిట్‌చాట్ కూడా నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా మంత్రి కేటీఆర్ నెటిజన్‌లతో పంచుకుంటారు. Read Also: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 100 మంది మృతి తాజాగా మంత్రి కేటీఆర్ తాను 2001లో లండన్‌లో ఉన్నప్పటి…
2016-17 తరువాత నుండి రాష్ట్రంలో వేలాదిమందికి ఉపాధి లభించింది. వర్కర్ టు ఓనర్ పథకం ను 400 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో దాదాపుగా 1,334 కోట్ల రూపాయల ఆర్డర్లను ఇచ్చాం. సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్, రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం స్పందన లేదు. 12 వందల ఎకరాల్లో వరంగల్ లో ఏర్పాటు చేయబోతున్న మెగా టెక్స్ టైల్…
కేటీఆర్ మాటలు చెప్పడం తప్ప పనులు చేయడం శూన్యం అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. కేటీఆర్ నాలాలు ఆక్రమణ తొలగింపులు చేయాలని అంటుంటే ఆశ్చర్యమేస్తుంది. అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయినా ఒక్క నాలా ఆక్రమణను తొలగించలేదు అన్నారు. ఓల్డ్ సిటీలో ఉన్న మీ ఎంఐఎం తమ్ముళ్లు భారీగా నాలాలు ఆక్రమణలు చేస్తున్నారు అని చెప్పారు. ఓల్డ్ సిటీ లో నాలాలు చెరువులు కబ్జాకు గురైనవి అన్నారు. అందుకే ఒక్క వర్షం వస్తే ఓల్డ్ సిటీ…
తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. ఈసందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు. 15 మీటర్ల తాడు…ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపనికి కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావును కట్టేస్తా. అమర వీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా. ప్రపంచంలో అత్యంత మోసకారి కేసీఆర్. ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి. తాడు తీసుకొచ్చేందుకే ఢిల్లీ వచ్చాను. నాపై 38 కేసులు పెట్టారు. ఏం సాధించారు. పోలీసులు…
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ నేత రాజాసింగ్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. తన నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీతో చర్చించాలని అపాయింట్ మెంట్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరడం లేదన్నారు. సభలో మీరు గతంలో ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను కలవవచ్చని, మాట్లాడవచ్చన్నారు. అసెంబ్లీ కార్యక్రమాల తర్వాత వందల సార్లు మీతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. మీకు ఫోన్ చేసినా కలవలేదు. మీ ఓఎస్డీకి ఫోన్ చేస్తే ఎప్పుడైనా…
మాజీ సీఎంకు రోశయ్యకు నివాళి అర్పించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రోశయ్య గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయన రాజకీయాల్లో సౌమ్యుడిగా ఉండేవారు. వాడివేడిగా సమావేశం జరుగుతున్న సమయంలో కూడా… నవ్వులు పూయించేలా చమత్కారంగా మాట్లాడేవారు అని గుర్తుచేశారు. సిరిసిల్ల లో నేత కార్మికుల గురించి అడిగితే… వెంటనే స్పందించారు అన్నారు. ఆయన ప్రజాస్వామ్య హితంగా ఉండేవారు అన్ని పేర్కొన కేటీఆర్ రోశయ్య లేరు అనేమాట… బాధాకరం… ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. అయితే రోశయ్య…
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం, మరో ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని తన ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలని కేటీఆర్ కోరారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే…
హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాడు కొత్తగా 32 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రతి 5 వేల నుంచి 10 వేల వరకు జనాభాకు ఒక బస్తీ దవాఖానాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలానగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి హరీష్‌రావు, షేక్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్.. దూల్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో ప్రజల వద్దకే…
తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ ఈరోజు మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ప్రగతిభవన్లో కలిశారు. తన జీవితం ఆధారంగా వచ్చిన “పూర్ణ” పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ కి అందించారు. పూర్ణ ప్రస్థానాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్, ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరే ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తనకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం పట్ల పూర్ణ మంత్రి…