తెలంగాణలో నిరుద్యోగ దీక్షకు దిగింది బీజేపీ. అయితే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. మంత్రి కేటీఆర్‌కి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’ను అవమానిస్తూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ పేరుతో చేసిన విమర్శలు చేయడం ముమ్మాటికీ నిరుద్యోగులను అవమానించడమే.…
ఎప్పుడూ అధికారులతో సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే మంత్రి కేటీఆర్ గోవా పర్యటనలో హాయిగా సేద తీరారు. ఈ సందర్భంగా గోవాలో ఆయన రోడ్ సైడ్ షాపింగ్ చేశారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా గోవా టూర్ వెళ్లిన మంత్రి కేటీఆర్ తన ఫ్యామిలీతో కలిసి లోకల్ బజారులో షాపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా అక్కడ షాపింగ్ చేసిన ఫోటోలతో పాటు చిరు వ్యాపారులతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం…
ఈమధ్యే బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు మంత్రి కేటీఆర్. తన కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ట్వీట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బంజారా హిల్స్ ఏసీపీకి టీఆర్‌ఎస్ సోషల్ మీడియా టీం ఫిర్యాదు చేసింది. కేటీఆర్ కొడుకు హిమాన్షుపై ట్విటర్‌లో పెట్టిన పోస్టుకు కోపంతో ఊగిపోయిన కొంతమంది టీఆర్‌ఎస్ సానుభూతిపరులు తీన్మార్ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు. మల్లన్న ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ ఖండించారు. బీజేపీ మీడియా నాయకులు…
చేనేత వస్త్ర పరిశ్రమ పైన జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే టెక్స్ టైల్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గత రెండు ఏళ్లు గా కరోనా సంక్షోభం కారణంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని.. ఇలాంటి నేపథ్యంలో..…
ఆ మంత్రికి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మధ్య అంత కెమిస్ట్రీ ఎలా కుదిరింది? అదేజిల్లాకు చెందిన మంత్రిని నిత్యం టార్గెట్ చేస్తున్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఎందుకు కలివిడిగా తిరిగారు? రానున్న రోజుల్లో ఈ పరిణామాలు.. జిల్లా రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాయా? ఇంతకీ ఎవరా మంత్రులు.. ఎవరా కాంగ్రెస్ ఎమ్మెల్యే? ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య వైరమైనా.. స్నేహమైనా హాట్ టాపిక్కే. అలాంటి అరుదైన దృశ్యాలకు సంగారెడ్డి జిల్లాలో…
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు ఎల్‌ఈడీ దీపాల వెలుగులో వెలిగిపోతోంది. ప్రభుత్వం తీసుకున్న భద్రత చర్యల కారణంగా ఔటర్ రింగు రోడ్డు కొత్త రూపు సంతరించుకుంది. హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్‌పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. నాలుగు ప్యాకేజీల్లో రూ.100.22 కోట్లతో ఏడేళ్ల వరకు ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉంటుంది. జంక్షన్, అండర్ పాస్, రెండు వైపులున్న సర్వీస్ రోడ్లపై కిలోమీటర్ దూరంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు…
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని… ఏది రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఫెయిల్ చేశారని ట్విట్టర్‌లో ఆరోపించాడు. తన సూసైడ్‌కు మంత్రులు కేటీఆర్, సబితలే కారణమని వారిని ట్యాగ్ చేశాడు. దీంతో క్షణాల్లోనే ఇంటర్ విద్యార్థి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. Read…
వరంగల్ నగరంలో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనుంది ఐటి దిగ్గజం జెన్పాక్ట్. తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్ ఫాక్ట్ రానుంది. మంత్రి కేటీఆర్‌ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్ ఫాక్ట్ ప్రతినిధి బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి…
తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతూ వుంటుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శలు చేస్తూ వుంటారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు తన దృష్టికి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెల సంగారెడ్డి మున్సిపాలిటీకి 15 కోట్ల 30 లక్షలు మంజూరు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు ప్రతి నెల 341 కోట్ల రూపాయల…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులో పర్యటించారు. చెన్నైలో తన క్యాంప్ ఆఫీస్‌లో తిరు కె.చంద్రశేఖర్ రావు మంత్రి కేటీఆర్‌తో కలిసి తనను మర్యాదపూర్వకంగా కలిశారని, అద్భుత సమయాన్ని తనతో గడిపారని ట్వీట్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. కేసీఆర్ పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు.ఈ భేటీలో ఇద్దరు సీఎంలు కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిపై చర్చించినట్టుగా తెలుస్తోంది. READ ALSO తమిళ సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ