2016-17 తరువాత నుండి రాష్ట్రంలో వేలాదిమందికి ఉపాధి లభించింది. వర్కర్ టు ఓనర్ పథకం ను 400 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో దాదాపుగా 1,334 కోట్ల రూపాయల ఆర్డర్లను ఇచ్చాం. సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్, రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం స్పందన లేదు. 12 వందల ఎకరాల్లో వరంగల్ లో ఏర్పాటు చేయబోతున్న మెగా టెక్స్ టైల్ పార్క్ కు నిధులు మంజూరు చేయమని అడిగినా లాభంలేదు. ఏడున్నరేళ్ళుగా చేనేత కార్మికులకు సవితి ప్రేమ చూపితే ఊరుకునేది లేదు. తెలంగాణ చేనేత కార్మికుల తరపున పార్లమెంట్ లో నిలదీస్తాం.
భారత దేశంలో నూలు, రసాయనాల పై 50% సబ్సిడీ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మనదొక్కటే రాబోయే కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్, రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ ను ఆమోదింప చేయాలి. ఇక పార్లమెంట్ లో వదిలి పెట్టం.. ప్రజాక్షేత్రంలో వదిలి పెట్టం అని అన్నారు. పీఎం మిత్ర కింద రాష్ట్రానికి వెయ్యి కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేసారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే ఈ ప్రాంతంలో ఉండే బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాతో కలిసి రావాలి అని పేర్కొన్నారు.