తెలంగాణ రాజకీయ నేతలపై పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ నేతలు రాజకీయ విమర్శలను కళారంగానికి అంటనీయరని పవన్ కొనియాడారు. తెలంగాణ నేతలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తారని తెలిపారు. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని.. కళను అక్కున చేర్చుకుని అభినందించడానికి ప్రాంతీయ కుల, మత భేదాలు ఉండవని తెలియజెప్పినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్ ప్రకటించారు. ఒకవైపు బయో ఏషియా సదస్సులో బిల్‌గేట్స్‌తో కీలకమైన వర్చువల్ భేటీ…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే పవన్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరోకు సంబంధించి ఏ ఈవెంట్‌ను మిస్ చేసుకోరు. అందులో పవన్ కల్యాణ్ అంటే యువతో పాటు అన్ని వయసుల వాళ్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఎంతో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రీ రిలీజ్ వేడుక…
తెలంగాణలోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తగిన గుర్తింపు లభిస్తోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు విధుల కేటాయింపు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో స్థానిక సుపరిపాలన సాకారం అవుతోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మరింత గౌరవం గుర్తింపు కోసం పని చేస్తానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి ల సహకారంతో జనగామ సమగ్ర అభివృద్ధికి కృషిచేయడం జరుగుతుందన్నారు. జనగామ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ…
ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటు కొత్తవి కలిపి 215 కంపెనీల నుంచి లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.6,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ విజయం సాధించిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనివల్ల అదనంగా 34,000 మందికి ఉపాధి లభించిందని, గత ఏడాదితో పోల్చితే 100 శాతం పెట్టుబడి ఎక్కువైందని ఆయన వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ అయిన బయోఏషియా 19వ ఎడిషన్‌ను ప్రారంభిస్తూ, కోవిడ్ ఆరోగ్య సంరక్షణ రంగంపై దృష్టి…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. నాలుగేళ్ల క్రితం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో చిరంజీవి, రామ్‌చరణ్ పిలిచిన ఓ సినిమా ఫంక్షన్‌కు హాజరయ్యానని.. అప్పుడు మెగాస్టార్, ఆయన సోదరుడు పవర్‌స్టార్ అని మాట్లాడుతుంటే.. తనను అభిమానులు అరుపులతో మాట్లాడనివ్వలేదని.. ఇప్పుడు కూడా తనని మాట్లాడనివ్వడం లేదని కేటీఆర్ నవ్వుతూ అన్నారు. 26 ఏళ్లుగా ఒకే విధమైన స్టార్‌డమ్‌ను…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చింది. ఈ ప్రి రిలీజ్ వేడుక కోసం వేయికళ్ళతో ఎదురుచూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేశాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేటీఆర్ తో పాటు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందడి చేశారు. కేటీఆర్-పవన్ కళ్యాణ్ కలిసి వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్కైవాక్ మరో మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నిర్మిస్తున్న లూప్ ఆకారపు సదుపాయం రాజధాని నగరంలో మరో ప్రత్యేకమైన ఇంజనీరింగ్ అచీవ్‌మెంట్‌గా నిలుస్తుంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయని మే 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని హెచ్‌ఎండీఏ అధికారి తెలిపారు. “నిర్మాణం యొక్క స్తంభాలు వేయబడ్డాయి. డెక్ భాగం యొక్క 60…
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి మూడేళ్లు అవుతుందని.. మూడేళ్ల కాలంలో మూడు పైసలు కూడా తేలేదన్నారు. బీజేపీ అంటే బక్వాస్ పార్టీ అని.. ఆ పార్టీ నేతలకు లొల్లి ఎక్కువ.. పని తక్కువ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటివరకు…
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2,603 రైతు వేదికలను దేశంలో ఎక్కడాలేని విధంగా నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. రైతులను సంఘటితం చేసి, తద్వారా వచ్చే లాభాన్ని తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో 6…