ప్రతిభకు ఆకాశమే హద్దు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అని సూచించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రతిభకు ఆకాశమే హద్దు.. వచ్చే మూడు నాలుగు నెలలు మొబైల్ వాడకాన్ని తగ్గించండి.. 3 నెలలు ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు…
బాసర ట్రిపుల్ ఐటీలో రెండవ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.. తరగతులు బహిష్కరించి ప్రధాన గేటు వద్దకు ఆందోళన చేయడం కోసం వస్తున్నారు విద్యార్థులు.. అయితే, విద్యార్థులను కొద్ది దూరంలోనే అడ్డుకున్నారు పోలీసులు, సెక్యూరిటీ… ఇక, ట్రిపుల్ ఐటీ నిరసనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. తమ సమస్యలపైన స్పందించాలని విజ్ఞప్తి చేసిన విద్యార్థికి సమాధానమిచ్చారాయన. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలను ముఖ్యమంత్రి…
తెలంగాణకు వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రానున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ఫోన్లకు అత్యంత ఆధునికమైన డిస్‌ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ ఇండియాలోనే అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ఉన్న రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (ఎలెస్ట్) అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ తయారీ యూనిట్‌ను తెలంగాణలో స్థాపించనుందని.. ఇందుకోసం రూ.24వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పటిష్టత కోసం ఆ పార్టీ నాయకత్వం కృషిని ప్రారంభించింది. పార్టీలో అసంతృప్తి వాదులుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి లు పార్టీ కార్యాలయానికి వచ్చేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇది పార్టీ లో ఒక్కవిజయంగా కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నప్పటికి పార్టీలో ఎటువంటి పదవులు లేకుండా ఉన్న వారిని కూడా దగ్గరకు తీసుకునే చర్యలు పార్టీ చేపట్టినట్లుగా అయ్యింది. పోలీసుల వినియోగాన్ని…
రెడ్లకు పగ్గాలు ఇస్తేనే మేము అధికారంలోకి వస్తాం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కుల పిచ్చి వాళ్ళు కావాలా? అన్ని కులాల వాళ్ళు కావాలనే కేసీఆర్ కావాలా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభించారు. రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి…
కులం, మతం పేరుతో చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చలి మంటలను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఖమ్మంజిల్లా లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభించారు. రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ…
పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఖమ్మం పట్టణంతోపాటు నియోజకవర్గంలో నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రి ప్రసంగిస్తారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చేలా ఇప్పటికే అధికార యంత్రాంగం, టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. పర్యటన వివరాలుః ఉదయం…
సీఎం కేసీఆర్ న్నాయకత్వంలో తెలంగాణలో చిరస్మరణీయంగా కొన్ని పథకాలు నిలిచిపోయాయి అని ప్రశంసలు కురిపించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మల్కాపేటలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చల్మెడ జానకి దేవి స్మారకార్థం సుమారు రూ. 2 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. విపక్షాలపై విరుచుకుపడుతూనే రాష్ట్రంలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలను…