జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. అత్యాచారం వంటి పెద్ద నేరాలకు పాల్పడే వ్యక్తులు.. పెద్దవారిగానే శిక్షించబడాలని.. యువకుడిగా కాదని ఆయన అన్నారు. I welcome & support the stand of @TelanganaCOPs If you are adult enough to commit a crime as heinous as rape, one must also be punished as…
ప్రధానితో జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల భేటీ నేపథ్యంలో ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు రావాల్సిన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ విమర్శించారు. నిధులు మాత్రం గుజరాత్‌కు, హైదరాబాద్‌కు మాటలా మోదీజీ అంటూ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.…
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలపై కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తోంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనతో పాటు ఇటీవల జరిగిన పలు అత్యాచార ఘటనలపై టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తోన్నాయి. ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాాజాగా కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలో ఆయన మీడియాతో మాట్లాడారు. పబ్ కల్చర్ తో…
మతపరమైన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నవీన్ జిందాల్, నుపుర్ శర్మలపై బీజేపీ అగ్రనాయకత్వం కఠిన చర్యలు తీసుకుందని ఆ పార్టీ నేత విజయశాంతి గుర్తుచేశారు. దేశంలో మత సామరస్యం దెబ్బతినకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగిన నియంత్రణలు చేపట్టిందని తెలిపారు. అయినప్పటికీ టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ బీజేపీపై విమర్శలు గుప్పించడం సరికాదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ భాగస్వామి పార్టీ, కవల మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా బీజేపీ నుంచి సస్పెండ్ అయిన…
బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి? అంటూ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సింది బీజీపీ తప్ప దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. మత ప్రబోధకుడిపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రాయబారులను పిలిపించి ముస్లిం దేశాలు నిరసన లేఖలు అందించడంతో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించిన…
ఓ మత వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ట్విటర్ మాధ్యమంగా ఆమెకు వంత పాడిన నవీన్ కుమార్ జిందాల్‌పై సైతం ఆ పార్టీ వేటు వేసింది. వీరి వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో.. వారిని సస్పెండ్ చేస్తూ బీజేపీ సంచలన ప్రకటన చేసింది. ఇదే సమయంలో తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను గౌరవిస్తుందని,…
ఒక నాయకులు కోడంగల్ లో తంతే మల్కాజ్ గిరిలో వచ్చిపడ్డాడు. ఆయనది ఐరన్ లెగ్ తెలుగు దేశంను నాశనం చేశాడు.. ఇప్పుడు కాంగ్రెస్ ను నాశనం చేయబోతున్నాడంటూ.. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. కోస్గిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తడో తెలియదు కానీ.. ఈరోజు మన పాలనలో దేశంలో 24గంటల కరెంట్ ఇస్తుంది మన రాష్ట్రమే అని ఆయన అన్నారు. 10 సార్లు అవకాశం ఇస్తే దేశాన్ని 50…
1. నేడు ఉదయం 11 గంటలకు ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. 2. నేడు ఏపీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు, ప్రస్తుత రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 3. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం…