KTR: కుల పిచ్చి వాళ్ళు కావాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెడ్లకు పగ్గాలు ఇస్తేనే మేము అధికారంలోకి వస్తాం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కుల పిచ్చి వాళ్ళు కావాలా? అన్ని కులాల వాళ్ళు కావాలనే కేసీఆర్ కావాలా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభించారు.
రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కులం ఒక్కటే ఓట్లు వేస్తే కుల సంఘానికి నాయకుడు అవుతాడు. విద్వంసం తప్ప మరే దానిమీద బీజేపీకి చిత్తశుద్ధి లేదు. ఎవరి దేవుడైనా దేవుడే. పర మతాన్ని గౌరవించడం నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కులం, మతం పేరిటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చలి మంటలను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
మన దేశంలో ఇవాళ ఏం జరుగుతుందో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న చర్చ గురించి అందరూ ఆలోచించాలి. నిన్న ప్రార్థనల అనంతరం 25 కోట్ల మంది ముస్లిం సోదరులు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఎందుకీ విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి.
చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరో ఆలోచించాలి. కరెంట్, నీళ్లు లేని గ్రామాల గురించి ఆలోచించాలి. పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలన్నారు. సవ్యమైన పద్ధతుల్లో ముందుకు పోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకే ఒక్క రోజు రూ. 100 కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?