గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదికను హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సంక్షోభం తర్వాత సాధారణ స్థితికి రావడానికి అనేక రంగాలు ఆపసోపాలు పడుతుంటే.. తెలంగాణలో ఐటీ రంగం శర వేగంగా దూసుకుపోతుందని, గత రికార్డులను బద్దలు కొడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను…
సివిల్స్ 2021లో ర్యాంకులు సాధించిన వారందరికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇవాళ తన ట్విట్టర్‌లో ఆయన స్పందిస్తూ.. సివిల్స్ ఫలితాలతో సంక్పలం, పట్టుదలకు చెందిన కొన్ని అద్భుతమైన కథలు వెలుగులోకి వచ్చినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. సివిల్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచిన టాప్ ముగ్గురు అమ్మాయిలకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన ర్యాంకర్లను కూడా మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. మీ ప్రతిభ, ప్రయత్నాలతో ఈ దేశాన్ని…
తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన మొత్తానికి విజయవంతంగా ముగిసింది. ఈనెల 18న లండన్ వెళ్లిన ఆయన అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తరువాత స్విట్జర్లాండ్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 45 కంపెనీల బృందాలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణలోని పెట్టుబడి అవకాశాల గురించి క్లుప్తంగా వివరించి అభివృద్ధి పథంలో ముందున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. దీంతో ప్రముఖ కంపెనీలు…
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు పర్యటన విజయవంతంగా ముగిసింది. మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా సుమారు 4200 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. ఈ మేరకు పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు తో పాటు పెట్టుబడి ప్రకటనలను ప్రకటించాయి. ఈ సారి భారతదేశం నుంచి దావోస్ లో పాల్గొన్న పలు రాష్ట్రాల పెవిలియన్ లతో పోల్చినపుడు తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.…
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో టీమ్ తెలంగాణ దూసుకుపోతోంది. వరుసగా పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. తాజాగా తెలంగాణలో రూ. 1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు హ్యుండై సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో ఈ పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. దీంతో పాటు తెలంగాణతో జట్టు కట్టేందుకు మాస్టర్స్ కార్డ్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాస్టర్ కార్డ్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమాన్‌తో గురువారం కేటీఆర్ సమావేశమయ్యారు.…
దేశంలోనే స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా టీహబ్ మారిందనడంలో సందేహం లేదు. టీ హద్ ద్వారా ఎన్నో కొత్త కొత్త స్టార్టప్‌లు పురుడుపోసుకున్నాయి. అయితే.. రోజు రోజుకు పెరుగుతున్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్2ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే. వివిధ రంగాల్లో పెరుగుతున్న స్టార్టప్‌లకు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండో దశ టీ హబ్ నిర్మాణాన్ని చేపట్టింది. గచ్చిబౌలిలోని త్రిబుల్ ఐటీలో ఏర్పాటు చేసిన టీ హబ్‌లో స్టార్టప్‌లకు…
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఫెర్రీ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లో మరో యూనిట్ నెలకొల్పేందుకు రూ. 500 కోట్లు పెట్టుబడి చేసేందుకు అంగీకారం తెలిపిందని మంత్రి కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా వెల్లడించారు. బుధవారం ఫెర్రీ ఫార్మా ప్రతినిధులతో సమావేశమైన తర్వాత, ఈ శుభవార్తను కేటీఆర్ తెలియజేశారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫ్రెర్రింగ్ ఫార్మా గతంలోనే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఫార్ములేటింగ్ సెంటర్‌ను నెలకొల్పేందుకు రూ. 500…
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి కేటీఆర్ నాయకత్వంలోని తెలంగాణ టీమ్ దూసుకుపోతోంది. కేటీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌కి ఉన్న విజన్‌ను కొనియాడుతూ.. ఏంజెల్ ఇన్వెస్టర్ ఆశా జడేజా మోత్వాని ట్విటర్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే 20 ఏళ్లలో ఈ దేశానికి కేటీఆర్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. ‘‘20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారత్‌కు ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ…
బీజేపీ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు పుట్టే పరిస్థితి లేదని.. అయినా గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ట్విట్టర్ వేదికగా ట్విట్టర్విల్లులో విమర్శనాస్త్రాలు సంధించారు. ”ధనిక రాష్ట్రం.. ఒక్కో ఎకరం కోట్లు.. అందులో నంబర్ వన్.. ఇందులో ఆదర్శం.. ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి కానీ, ఆచరణలో కూడా ఉంటే బాగుంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికి ధనిక రాష్ట్రాన్ని కాస్తా ఇప్పుడు అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారు. అప్పు…
దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా అరుదైన సమావేశం జరిగింది.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా మీట్ అయ్యారు. తమ రాష్ట్రాలకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన నేతలు.. ఇలా భేటీ అయ్యారు. Read Also: Gannavaram Politics: గన్నవరం టికెట్ ఆయనకే.. అధిష్టానం క్లారిటీ..! మరోవైపు ఇప్పటికే పలు దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధి బృందాలతో సమావేశాలు నిర్వహించారు ఇద్దరు…