హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. చింతలకుంట నుంచి మాల్ మైసమ్మ వరకు ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా సిగ్నల్ ఫ్రీ సౌకర్యం అందుబాటులో రానుంది. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 32 కోట్ల వ్యయంతో మూడు లేన్ల ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అన్ని ఫ్లై ఓవర్ లు పూర్తయ్యాయని, మూడు మాత్రమే చివరి దశలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ లో ఆ మూడు ప్రారంభం చేసిన తర్వాత నే ఎన్నికల కు వెళతామని ఆయన వ్యాఖ్యానించారు. నాగోల్ మెట్రోను ఎల్బీ నగర్ కు జోడిస్తామని ఆయన వెల్లడించారు.
Also Read : Sirivennela: మహాకవి కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అది ఖచ్చితంగా పూర్తి చేస్తామని, హయత్ నగర్ వరకు విస్తరిస్తామన్నారు. ఎయిర్‌పోర్ట్ వరకు కూడా మెట్రో తీసుకెళతామని ఆయన పేర్కొన్నారు. జీవో 118 కింద దశాబ్దాలుగా సమస్య ఉందన్న మంత్రి కేటీఆర్.. వారికి ఈనెల చివరి వరకు పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంచాచారి పేరు పెడతామని ఆయన సంచలన ప్రకటన చేశారు. అందుకు తగిన విధంగా ఆదేశాలు ఇస్తామని, కొత్త ఫ్లై ఓవర్ కు మాల్ మైసమ్మ పేరు పెడతామన్నారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో సిగ్నల్ ఫ్రీ గా ఎల్బీ నగర్ చౌరస్తా మారనుందన్నారు.
Also Read : RRR: ఏడాది గడిచినా ‘ఆర్ ఆర్ ఆర్’ సౌండ్ వినిపిస్తూనే ఉంది… ఏ ఇండియన్ సినిమా ఇన్ని అవార్డ్స్ గెలిచి ఉండదు