నిజమాబాద్ వర్ని మండలం సిద్దాపూర్ లో రిజర్వాయర్ నిర్మాణం పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిని ఓ చిన్న కారణం చూపి అనర్హత వేటు వేశారని ఆయన మండిపడ్డారు. శిక్ష అమలయ్యేకంటే ముందే అనర్హత వేటు ప్రకటించారని ఆయన విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం ఖూనీ చేసేచర్య అని, నిన్నటిరోజు చీకటిరోజని ఆయన వ్యాఖ్యానించారు. తక్షణమే రాహుల్ పై వేటు ఎత్తేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read : Women’s World Boxing Championship: స్వర్ణం గెలిచిన నీతూ.. ఆరో మహిళగా రికార్డు
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో నిందితులను పట్టుకున్నారని, దోషులు ఎవరైనా శిక్షిస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు. అయినా కొందరు దురుద్ధేశపూర్వకంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని దుర్భుద్ధితో కొందరు చేసిన పనే ఈ లీకేజీ వ్యవహారమన్నారు. విచారణలో ఎవరెవరున్నారనేవి బయటపడతాయని, కొందరు నాయకులు ఆధారాల్లేకుండా మైకుల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కి లీకేజీ తో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.