Konda Surekha: వరంగల్ మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తోందని మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు వరంగల్ లక్ష్మీపురం లోని కూరగాయల మార్కెట్ ను సందర్శించి మార్కెట్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విభజించి పాలించే మనస్తత్వం బీజేపీదని.. అది ఓ మతతత్వ పార్టీ అని మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని విమర్శించారు. ప్రజల అవసరాల కోసం ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఎప్పుడు పాటుపడలేదని ఆరోపించారు.
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసుపై నేడు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరపనుంది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ ల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు మిగతా ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ల స్టేట్మెంట్‌లను కోర్టు రికార్డ్ చేయనుంది.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ నాంపల్లిలోని స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ డిఫర్మేషన్ దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ లను సాక్షులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను అమెరికాలో 6 సంవత్సరాలు చదువుకున్నానని.. చదువు పూర్తి అయ్యాక ఇండియాకు తిరిగి వచ్చినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ములుగు జిల్లాలోని మేడారం వనదేవతలను మంత్రి కొండా సురేఖ దంపతులు దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన మంత్రి కొండా సురేఖ.. సమ్మక్క సారలమ్మలకు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన కోట్లాది భక్తులను ఇంతటి అడవి ప్రాంతంలో కూడా ఎటువంటి హాని తలపెట్టకుండా సురక్షితంగా ఇండ్లకు భక్తులను పంపించే విధంగా వనదేవతలు కాపు కాస్తారని ఆమె కొనియాడారు.…
మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు.. హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పరువు నష్టం కేసు వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిగిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి.. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
సినిమా వాళ్ల ఎపిసోడ్ లో కొంత సంయమనం పాటించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫిర్యాదుదారులు మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అని అడిగారు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా... సినిమా వాళ్ళు చర్చను కొనసాగించారన్నారు.
DK Aruna: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది.. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పని చేశాం.
Nagarjuna Files Defamation Case Against Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున తరపు న్యాయవాది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారు అని నాగార్జున పిటిషన్ లో పేర్కొన్నారు. నిజానికి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య…
TPCC Cheif Mahesh Goud రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ నిన్న సమంత, నాగ చైతన్య